Kajal Agarwal: అసుర దహననానికి సత్యభామ సిద్ధం!

టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ఈ భామ రెండేళ్ల కిందట ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకుని సినిమాలకి కొంచెం గ్యాప్ తీసుకుంది. పైగా ఓ బిడ్డకు జన్మనిచ్చింది కూడా. ఇప్పుడు మళ్ళీ తన సినిమాలతో ఆడియన్స్ ని అలరించడానికి సిద్ధమైంది ఈ మిత్రవింద. ఆల్రెడీ పలు సినిమాల్లో నటించినా సరైన సక్సెస్ మాత్రం ఇంకా రాలేదు.

రీసెంట్ గా భగవంత్ కేసరి లో హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ అందులో పెద్దగా ఇంపార్టెన్స్ లేకున్నా స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంది. ఇక తాజాగా కాజల్ అగర్వాల్ ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సుమన్ చిక్కాల డైరెక్ట్ చేస్తున్న”సత్యభామ” అనే చిత్రంలో కాజల్ ఒక పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండడం విశేషం. ఇంతకు ముందు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఆకట్టుకోగా, ఇప్పుడు టీజర్ తో కనువిందు చేయనుంది.

ఈ దీపావళి కానుకగా “సత్యభామ” టీజర్ ని నవంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. గన్ పట్టుకుని ఉన్న కాజల్ లుక్ ని చూపిస్తూ, “అసుర దహనానికి సత్యభామ సిద్ధం” అనే ట్యాగ్ ని కూడా పెట్టారు. ఇక కాజల్ అగర్వాల్ కి ఈ సినిమా 60వ సినిమా కావడం విశేషం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు