Krishnamma: సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

 

Krishnamma: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది యంగ్ స్టార్ హీరోలు ఉన్నారు. అందులో తమ టాలెంట్ ను ఉపయోగించుకొని ఇండస్ట్రీని ఏలుతున్నారు కొంతమంది హీరోలు. అయితే మరి కొంతమంది హీరోలు మాత్రం బ్యాగ్రౌండ్తో ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నారు. అలా కొంతమంది సక్సెస్ అయి.. దూసుకుపోతున్నారు. మరికొంతమంది తమ టాలెంట్ ఉపయోగించి… ఎన్నో హిట్ సినిమాలు కూడా చేస్తున్నారు. వారు చేసిన సినిమా ప్రతి ఒక్కటి హిట్ అవుతూనే ఉంటుంది. Krishnamma

అలాంటి హీరోలలో సత్యదేవ్ ఒకడు. హీరో సత్యదేవ్ గురించి ఎంత చెప్పిన తక్కువ అవుతుంది. ఇండస్ట్రీలో తక్కువ కాలంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సత్యదేవ్. హిట్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సత్యదేవ సినిమాలు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీని ఏలుతున్నాడు ఈ యంగ్ హీరో. నటన ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ… అలాగే హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు.Krishnamma

- Advertisement -

అయితే ఇప్పటికే హీరో సత్యదేవ్ చాలా సినిమాలు చేశాడు. ఏడాదికి కచ్చితంగా రెండు సినిమాలు చేస్తాడు ఈ హీరో. ఇందులో చాలా హిట్స్ ఉన్నాయి. గా ప్రస్తుతం కృష్ణమ్మ అనే సినిమా చేస్తున్నాడు హీరో సత్యదేవ్. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. గాడ్సే సినిమా తర్వాత… ఈ క్రిష్టమ్మ సినిమాను హిట్ చేసుకోవాలని చాలా కష్టపడుతున్నాడు సత్యదేవ్.

Satyadevs Krishnamma release date fixed

వివి గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయిపోయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి. ఈ సినిమాలో హీరో సత్యదేవ్ సరసన అతిర రాజి అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. అలాగే ఈ సినిమాలో కొన్ని పాటలకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. సిద్ శ్రీరామ్ ఇందులో ఒక సాంగ్ కూడా పాడాడు.

అయితే తాజాగా కృష్ణమ్మ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సత్యదేవ్ నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మే మూడో తేదీన కృష్ణమ్మ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది చిత్రం బృందం. అలాగే ఓ చిన్న వీడియోను కూడా వదిలారు. ఇందులో సత్యదేవ్ జైల్ ఖైదీగా కనిపించాడు.

ఓవరాల్ గా ఈ వీడియో చూస్తే సినిమా మొత్తం క్రైమ్ యాంగిల్ లో నడుస్తుందని తెలుస్తోంది. ఎండాకాలంలో రిలీజ్ అయిన సినిమాలు చాలా హీట్ అయ్యాయి. అందుకే సత్యదేవ్ కూడా ఇప్పుడే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట. మరి ఈ యంగ్‌ హీరో సత్య దేవ్‌ చేస్తున్న కృష్ణమ్మ సినిమాను ప్రేక్షకులు ఏ మేరకు సక్సెస్‌ చేస్తారనేది మరో నెల రోజుల్లోనే క్లారిటీ రానుంది. ఆయన ఫ్యాన్స్‌ మాత్రం ఇప్పటి నుంచి హడా విడీ చేస్తున్నారు.Satyadevs Krishnamma release date fixed

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు