Sean Diddy Combs : 17 ఏళ్ల బాలికపై అత్యాచారం ఆరోపణలు…. అమెరికన్ ర్యాపర్ కేసు తేలేదెప్పుడు?

Sean Diddy Combs : దిగ్గజ హిప్-హాప్ సింగర్, అమెరికన్ రాపర్ అయిన సీన్ ‘డిడ్డీ’ కాంబ్స్ 2003లో న్యూయార్క్ రికార్డింగ్ స్టూడియోలో 17 ఏళ్ల బాలికపై తాను, మరో ఇద్దరు అత్యాచారం చేశారని ఆరోపిస్తూ వేసిన దావాను కొట్టివేయాలని కోరాడు. సీన్, అతని న్యాయవాదితో కలిసి ఇటీవలే వ్యాజ్యాన్ని కొట్టివేయడానికి మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు. కేసులో స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకపోవడంతో ఈ కేసును కొట్టివేయాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.

వివాదం ఏంటంటే?

గత ఏడాది డిసెంబర్‌ లో ఓ అమ్మాయి సీన్ తనను లైంగికంగా వేధించాడు అంటూ ఆరోపణలు చేసింది. ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్న ఒక అమ్మాయి మార్చిలో కాంబ్స్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారు అంటూ కేసు వేసింది. ఆ సమయంలో కాంబ్స్, హార్వ్ పియరీ, మరొక వ్యక్తి లైంగికంగా వేధించారని ఆమె చెప్పింది. సదరు అమ్మాయి వాదనల ప్రకారం, ఆమెను ప్రైవేట్ జెట్ ద్వారా న్యూయార్క్‌కు తరలించి, డ్రగ్స్, ఆల్కహాల్‌ ను ఆమెకు ఇచ్చి, తర్వాత రేప్ చేశారు. అయితే మూడవ వ్యక్తి పేరును ఆమె బయట పెట్టలేదు.

సీన్ గార్డ్స్ ఏమన్నారంటే?

ప్రతి క్షణం సీన్ వెంటే ఉండే ఆయన సెక్యూరిటీ గార్డులు ఆ అమ్మాయి వాదనలను ఖండించారు. దావాలో ఆమె పేర్కొన్న విషయం నమ్మదగినదిగా లేదని, దాదాపు రెండు దశాబ్దాల నాటి ఆరోపణకు సంబంధించిన ఈ సంఘటనను రుజువు చేయలేమని వాదించింది. న్యూయార్క్ చట్టం ప్రకారం ఇది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని పేర్కొంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

న్యూయార్క్ చట్టం ఏంటంటే?

న్యూయార్క్ అడల్ట్ సర్వైవర్స్ యాక్ట్ కింద వేసిన వాజ్యం ఇది. లైంగిక వేధింపుల నుండి బయటపడినవారు సంవత్సరాల లేదా దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనలను దాఖలు చేయడానికి కొన్ని చట్టపరమైన గడువులను అక్కడి న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ చట్టం ద్వారా గడువు ముగిసినప్పటికీ, కాంబ్స్‌పై వేసిన దావాను వేరొక చట్టం కింద తీసుకున్నారు. న్యూయార్క్ సిటీ విక్టిమ్స్ ఆఫ్ జెండర్-మోటివేటెడ్ వయొలెన్స్ ప్రొటెక్షన్ లా ప్రకారం ఆయనపై కేసు వెయ్యగామ్ దానికి సంబంధించిన విచారణ జరుగుతోంది. ఇది లైంగిక వేధింపుల దావాలతో కూడిన సివిల్ ఫిర్యాదులను దాఖలు చేయడానికి వీలు కలిపిస్తుంది.

సీన్ తరపు న్యాయవాదుల వాదన

న్యూయార్క్ రాష్ట్ర చట్టం నిర్దేశించిన గడువు ముగిసిన తర్వాత ఆ అమ్మాయి దావా వేసినందున దానిని కొట్టివేయాలని సీన్ తరఫున న్యాయ బృందం వాదించింది. ఈ విషయంలో రాష్ట్ర చట్టం నగర చట్టాన్ని భర్తీ చేస్తుందని, అందువల్ల ఈ వ్యాజ్యాన్ని సకాలంలో పరిగణించేందుకు ఆగస్టు 2021లోపు దాఖలు చేసి ఉండాలని అన్నారు. ఈ చట్టపరమైన సవాలు తర్వాత కేసు ముందుకు సాగితే దావా వెనుక ఉన్న మహిళ తన పేరును వెల్లడించాల్సి ఉంటుందని కేసును పర్యవేక్షిస్తున్న న్యాయమూర్తి తీర్పునిచ్చారు. కోర్టు ఫైలింగ్స్‌లో మహిళ గుర్తింపును బహిర్గతం చేయనప్పటికీ, ఈ విషయాన్ని న్యాయంగా నిర్ధారించడంలో పారదర్శకత అవసరమని కాంబ్స్ న్యాయ బృందం వాదించింది.

సీన్ పై ఆరోపణల వెల్లువ

సీన్ పై ఇప్పటికే దారుణమైన ఆరోపణలు ఉన్నాయి.సెక్స్-ట్రాఫికింగ్, అత్యాచారం, లైంగిక వేధింపులు, శారీరక వేధింపులు వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా ఒక్కటి కూడా నిరూపణ కాలేదు. ప్రస్తుతానికి సీన్ న్యాయపోరాటం కొనసాగిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు