Sekhar Basha – Lavanya: RJ శేఖర్ బాషా పై దాడి.. హాస్పిటల్లో చికిత్స..!

Sekhar Basha – Lavanya.. లావణ్య , రాజ్ తరుణ్ మధ్య గొడవ ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ గత రెండు మూడు వారాల నుంచి వీరిద్దరికి సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా రాజ్ తరుణ్ కి సంబంధించిన చాలామంది లావణ్య పై దాడి చేస్తున్నారని చెప్పవచ్చు. అలాంటి వారిలో ఆర్జే శేఖర్ భాషా కూడా ఒకరు. రాజ్ తరుణ్ స్నేహితుడైన ఈయన లావణ్య పై విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆమె నిన్న మీడియా ముందు తన గోడు వెళ్ళబోసుకుంది. ప్రైవేట్ పార్ట్స్ పై విచక్షణారహితంగా దాడి చేశాడని, కడుపుపై తన్నాడని , వీపుపై తన్నాడు అంటూ గాయాలను కూడా చూపిస్తూ మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అంతే కాదు తనకు ప్రాణహాని ఉందని, తనకు ఏదైనా జరిగితే దానికి కారణం రాజ్ తరుణ్ స్నేహితుడు ఆర్ జె శేఖర్ బాషా అంటూ ఎఫ్ఐఆర్లో కేసు ఫైల్ చేయించింది లావణ్య. అంతేకాదు అతనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరింది.

Sekhar Basha - Lavanya: Attack on RJ Sekhar Basha.. Hospital treatment..!
Sekhar Basha – Lavanya: Attack on RJ Sekhar Basha.. Hospital treatment..!

ఆర్. జే .శేఖర్ భాషా పై దాడి..

అయితే ఈ విషయం అందరిని ఆశ్చర్యపరిచేలోపే ఇప్పుడు శేఖర్ భాషా పై దాడి జరగడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా ఆర్జే శేఖర్ తనపై దాడి జరిగినట్లు ఒక ప్రముఖ టీవీ ఛానల్ తో చెప్పుకో గా ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఆ వీడియోలో శేఖర్ భాషా తన చేతికి ఫ్రాక్చర్ అయినట్లు కట్టు కట్టుకొని మరీ కనిపించారు..మరి ఆయనపై దాడి చేసింది ఎవరో ఆయన మాటల్లోనే ఇప్పుడు చూద్దాం.

శేఖర్ భాషా పై దాడి చేయించిన లావణ్య..

శేఖర్ భాషా మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ కి లావణ్య అన్యాయం చేస్తుందని గమనించిన నేను ఆధారాలతో సహా బయటకు పెట్టాను. ముఖ్యంగా డ్రగ్స్ కు సంబంధించి ఉదయ్, ప్రీతి పేర్లను ఎప్పుడైతే బయటపెట్టానో అప్పుడు లావణ్య విచక్షణా రహితంగా ప్రవర్తించి నాపై చెప్పులతో దాడి చేసింది. నేను ఏ ఛానల్ కి వెళ్తే అక్కడ బూతులు తిట్టడం, ఏదో రకంగా నాకు కోపం తెప్పించేలా చేసి నిజాలు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడం, ఇలా ఏదో ఒకటి చేస్తూనే వస్తోంది. నిన్న కూడా ఒక ఛానల్ కి వెళ్తే వీడు కొత్తగా ఏం పట్టుకోస్తాడో అని భయపడిపోయి గట్టిగా అరిచి , రౌడీయిజం చేసింది. లైవ్ లోనే నాపై దాడి చేసిన ఈమె , అర్ధరాత్రి కాపుగాసి నేను వెళ్తుండగా నాపై దాడి చేయించింది. నాపై లావణ్య తన రౌడీలతో దాడి చేయించింది అంటూ శేఖర్ భాషా తాజాగా మీడియాతో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయాలు, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి దీనిపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్న శేఖర్ బాషా చికిత్స పొందుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు