Sekhar Master: లక్కీ ఛాన్స్.. అందరి ముందే..ముద్దుల్లో తడిసిపోయారుగా..?

Sekhar Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమా పాటలకు కొరియోగ్రఫీ అందిస్తూ మంచి పాపులారిటీ సొంతం చేసుకోవడమే కాదు పలు డాన్స్ షో లకి జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త స్టైల్ లో ఎంటర్టైన్మెంట్ అందించడానికి టీవీ చానల్స్ కూడా పోటీ పడుతున్నాయి. ఇందుకోసమే బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలతో రకరకాల ప్రోగ్రామ్స్ చేయిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా డాన్స్, సాంగ్స్, కామెడీ స్కిట్స్ వంటి వాటితో అదరగొట్టేస్తున్నాయి..

Sekhar Master: Lucky chance.. in front of everyone.. soaked in kisses..?
Sekhar Master: Lucky chance.. in front of everyone.. soaked in kisses..?

ఆడియన్స్ కి మంచి వినోదం..

ఇప్పటికే బుల్లితెరపై పటాస్, జబర్దస్త్ , ఢీ , బిగ్ బాస్ ఇలా ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తున్న విషయం తెలిసిందే.. ఇక ఈ క్రమంలోనే కొత్తగా రాబోయే ప్రోగ్రామ్స్ కి సంబంధించిన ప్రోమో లు కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక ప్రోగ్రాంలో శేఖర్ మాస్టర్ ని ముద్దులతో ముంచేసింది ఒక ముద్దుగుమ్మ.. అందరి ముందు అలా ముద్దు పెట్టేసరికి ఆ ప్రోమో కాస్త వైరల్ గా మారుతుంది. మరి ఆ అమ్మాయి ఎవరు? ఏ ప్రోగ్రాం ఏంటి?ఎందుకు అంతలా ముద్దు పెట్టేసింది..? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..

కొత్త గేమ్ షో..

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఆడియన్స్ కు మంచి వినోదాన్ని పంచుతున్నాయి.. ఈ క్రమంలోనే స్టార్ మా లో అమ్మాయిల్లో అబ్బాయిల్లో ఎవరు గొప్ప? అనే ప్రశ్న తలెత్తడం.. దానికి మేము అంటే మేము గొప్ప అంటూ రెండు టీమ్స్ పోటీపడే కాన్సెప్ట్ తో స్టార్ మా ఒక కొత్త ప్రోగ్రాం మొదలుపెట్టింది… కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ పేరుతో వస్తున్న ఈ గేమ్ షో ఈనెల 29 నుంచి స్టార్ మా లో ప్రసారం కానుంది.. ఇక ఈ గేమ్ షో కి సంబంధించిన ప్రోమోని అప్పుడే రిలీజ్ చేశారు. తాజాగా ఈ ప్రోగ్రాం లో యాంకర్లను కాస్త బోల్డ్ గానే చూపించారు.. ఈ గేమ్ షోలో ఆటపాటలతో పాటు ఊహించని రౌండ్స్ చిత్ర విచిత్రమైన టాస్కులు చాలెంజ్ లు కూడా ఉండబోతున్నాయి.. ఈ ప్రోమోలో అనసూయ టాప్ తీసేసి హాట్ లుక్ లో కనిపించింది.. అంతేకాదు శేఖర్ మాస్టర్ షర్టు తీసేసి..రా చూసుకుందాం అంటూ ధమ్కీ ఇవ్వడం మరింత వైరల్ గా మారిందని చెప్పవచ్చు..

- Advertisement -

శేఖర్ మాస్టర్ కి ముద్దు పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ ఆయేషా..

ఇకపోతే ఇందులో కిరాక్ బాయ్స్ టీమ్ కి శేఖర్ మాస్టర్ లీడర్ ఐతే.. కిలాడీ గర్ల్స్ టీం కి అనసూయ లీడర్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ బిగ్ బాస్ ఫేమ్ ఆయేషాకి టాస్క్ ఇచ్చారు. వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ప్లేట్లో పెట్టడంతో ఆమె వాటిని తిని వెళ్లి శేఖర్ మాస్టర్ కి ఘాటైన ముద్దు పెట్టింది. దీంతో విజిల్స్ చెప్పట్లు మారు మ్రోగాయి.. అందరి ముందు పబ్లిక్ గా స్టేజ్ పైనే ఇలా ముద్దు పెట్టడంతో శేఖర్ మాస్టర్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ గా మారుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు