Selfish: ఆశిష్ ని స్టార్ హీరోని చేయడానికి కష్టపడుతున్న దిల్ రాజు

దిల్ రాజు టాలీవుడ్ లోనే అందరికన్నా సక్సెస్ గ్రాఫ్ ఎక్కువగా ఉన్న ప్రొడ్యూసర్. విరామం లేకుండా సినిమాలు చేస్తుండే ఈయన ప్రొడక్షన్ నుంచి ఎంతో మంది హీరోలుగా, దర్శకులుగా పరిచయమై ఇప్పుడు ఇండస్ట్రీ లో మంచి సక్సెస్ తో ఉన్నారు. అయితే తెలుగు సినీ పరిశ్రమలో ప్రొడ్యూసర్స్ కొడుకులు హీరోలుగా,దర్శకుల కొడుకులు హీరోలుగా లాంచ్ అవడం చూస్తూనే ఉంటాం. కానీ స్టార్ హీరోల వారసత్వంగా వచ్చిన హీరోల దాటికి వీళ్ళు తట్టుకోలేక చాలా మంది యాక్టింగ్ వైపు చూడకుండా వాళ్ళకి కలిసొచ్చిన అదే ప్రొడ్యూసర్ గానో, డైరెక్టర్ గానో కొనసాగుతున్నారు.

అయితే టాలీవుడ్ లోనే అపజయం ఎరుగని ప్రొడ్యూసర్ గా పేరున్న దిల్ రాజుకి మాత్రం వారసులు ఎవరు లేకపోవడంతో ఈయన ఫ్యామిలీ నుంచి హీరోలు ఎవరు రాలేదు. కానీ సడన్ గా కొడుకులు ఎవరులేరనుకునే దిల్ రాజుకి వారసుడుగా, ఆయన మేనల్లుడు ఆశిష్ రౌడీ బాయ్స్ సినిమాతో వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే తన పేరుతో ఆశిష్ లాంచ్ అవడంతో ,ఆశిష్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు దిల్ రాజు. క్రిందటిసారి యూత్ ని టార్గెట్ చేస్తూ రౌడీ బాయ్స్ సినిమాతో ఆశిష్ ని లాంచ్ చేసాడు దిల్ రాజు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. దాంతో ఇప్పుడు మాస్ ఆడియన్స్ టార్గెట్ చేస్తూ దిల్ రాజు ఆశిష్ తో హైదరాబాద్ పాత బస్తి నేపథ్యంలో ఉండే కథతో సెల్ఫిష్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడు విశాల్ కాశీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

అయితే ఈ సినిమాతో ఆశిష్ కి  ఎలాగైన మార్కెట్ ఓపెన్ అవ్వాలనే దిశగా దిల్ రాజు ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలో కలగజేసుకుంటున్నరంట. సోమవారం రోజున ఆశిష్ పుట్టిన రోజు సందర్బంగా సెల్ఫిష్  సినిమాలోని ఒక పాటని లాంచ్ చేసారు దిల్ రాజు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ” మీకు నచ్చే అన్ని అంశాలతో ఈ సినిమా మీ ముందుకి వస్తుంది. ఈ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని డైరెక్టర్ విశాల్ ని హింసిస్తున్న, ఎక్కడ కంప్రమైజ్ అవ్వకుండా సినిమాని నిర్మిస్తున్నాం సుకుమార్ నేను చాలా రోజుల తరువాత సిరియస్ తీసుకొని ఈ సినిమా చేస్తున్నాం. మారిన ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టు ఈ సినిమా ఉంటుంది”  అని అయన అన్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు