Nani : మీ పిల్లల్ని స్కూలుకు కాదు… థియేటర్ కి పంపించండి..

Nani :తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యాక్టర్స్ లో నివేద థామస్ ఒకరు. ఇప్పటివరకు నివేదా ఎన్నో అద్భుతమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. కొన్ని లీడ్ రోల్ సినిమాలు కూడా చేశారు నివేద. ప్రస్తుతం నందకిషోర్ ఇమాని దర్శకత్వంలో నివేద థామస్ నటించిన సినిమా “35 చిన్న కథ కాదు” ఈ సినిమాను రానా దగ్గుపాటి సిద్ధార్థ రాళ్లపల్లి కలిసి నిర్మించారు ఈ సినిమా సెప్టెంబర్ 6న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు దీనికి న్యాచురల్ స్టార్ నాని హాజరయ్యారు.

35 సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి అలానే ఇదివరకే కొన్ని ప్రీమియర్స్ కూడా వేశారు. ఆ ప్రీమియర్ షోస్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది వాటన్నిటిని కూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు ప్రదర్శించారు. ఈవెంట్ కి హాజరైన నాని మాట్లాడుతూ 35 అనే సినిమా నేను చూసాను. ముందు ప్రేక్షకుల రెస్పాన్స్ వేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే అది చూసిన తర్వాత ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు అంటూ చెప్పుకొచ్చారు నాని. రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన బెస్ట్ ఫిలిం 35. ఈ సినిమా అంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు.

35 Chinna Katha Kaadu

- Advertisement -

మీరు పిల్లలతోపాటు ఈ సినిమాను చూడండి ఒకరోజు స్కూల్ కి వెళ్లకపోయినా పర్వాలేదు. ఆరోజు స్కూల్లో కంటే కూడా 35 సినిమా థియేటర్లో ఎక్కువ నేర్చుకుంటారు అని నాని చెబుతూ వచ్చాడు. అలానే తన రీసెంట్ ఫిలిమ్ సరిపోదా శనివారం గురించి మాట్లాడుతూ, సరిపోదా శనివారం లాంటి సినిమాలు మళ్లీ మళ్లీ వస్తాయి. కానీ 35 లాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు. ఖచ్చితంగా 35 సినిమాని చూడండి పొరపాటున కూడా మిస్ అవ్వకండి అంటూ నాని తెలిపాడు.

రీసెంట్ గా ప్రొడ్యూసర్ కూడా కన్నడలో కాంతార, మలయాళంలో మంజుమ్మల్ బాయ్స్, తమిళ్‌లో మహారాజ, తెలుగులో “35-చిన్న కథ కాదు’. ఇది పదేళ్ళు నిలిచిపోయే సినిమా అవుతుంది. బాపు గారు, విశ్వనాథ్ గారి సినిమాలని గుర్తుచేస్తుంది. ఈ సినిమా నా కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది. అని చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు