Naresh : నాగ్ అశ్విన్ కి నరేష్ రిక్వెస్ట్.. వాళ్ళ బేబీ యెటో వెళ్ళిపోయిందట.. మీకు తెలుసా?

Naresh : సీనియర్ నటుడు నరేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే రీసెంట్ గా నటుడు నరేష్ వాళ్ళ బేబీ యెటో వెళ్లిపోయిందట.. మీకేమైనా తెలుసా? అంటూ నాగ్ అశ్విన్ ని అండ్ బుజ్జి ఫ్యాన్స్ ని అడుగుతున్నాడు. నాగ్ అశ్విన్ కి బుజ్జి ఎంతో వాళ్ళకి బేబీ కూడా అంతేనట..! నరేష్ మాట్లాడుతూ ఈ వీడియో చూసిన వాళ్లెవరికైనా బేబీ కనిపిస్తే మాకందివ్వరా అంటూ పోస్ట్ చేసాడు. అసలు నాగ్ అశ్విన్ ని ఎందుకు రిక్వెస్ట్ చేసాడు. ఇంతకీ అసలు నరేష్ వాళ్ళ ఈ బేబీ ఎవరని నెట్టింట తెగ చర్చ జరుగుతుంది. ఏంటా అని ఆరా తీస్తే అసలు విషయం ఇదా అని నెటిజన్లు షాక్ అయ్యారు.

 Senior Actor Naresh asks to Director Nag Ashwin & Bujji fans for help

నరేష్ రిక్వెస్ట్ ఎందుకు చేసాడు…

అయితే అసలు విషయానికి వస్తే.. సీనియ‌ర్ నటుడు న‌రేష్, బ్రహ్మానందం ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న తెలుగు కామెడీ మూవీ “వీరాంజ‌నేయులు విహార‌యాత్ర”. ఈ మూవీ రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకోగా, త్వరలో నేరుగా ఈటివి విన్ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. భామ‌క‌లాపం వెబ్ సిరీస్ నిర్మించిన నిర్మాత‌లు బాపినీడు, సుధీర్ ఈద‌ర క‌లిసి “వీరాంజ‌నేయులు విహార‌యాత్ర” పేరుతో ఓ కామెడీ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సుధీర్ పుల్ల‌ట్ల ద‌ర్శ‌కుడిగా పరిచయం కాబోతున్నాడు. సీనియ‌ర్ నటుడు న‌రేష్, బ్ర‌హ్మానందం ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తుండగా, కీడాకోలా ఫేమ్ రాగ్‌ మ‌యూర్‌, ప్రియా వ‌డ్ల‌మాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

- Advertisement -

నరేష్ బేబీ ఎవరు?

అయితే నటుడు నరేష్ (Naresh) నాగ్ అశ్విన్ ని రిక్వెస్ట్ చేయడానికి కారణం ఉంది. వీరాంజనేయులు విహారయాత్ర సినిమాలో ప్రధానపాత్రలు పోషిస్తున్న నరేష్, బ్రహ్మానందం ల యొక్క బేబీ తప్పిపోయిందట. బేబీ అంటే పాప కాదు.. సినిమాలో వాళ్ళు నడిపే ఒక ‘ఓమిని కార్’. నాగ్ అశ్విన్ కి కల్కి ‘బుజ్జి’ ఎలాగో వాళ్లకు ఈ బేబీ కూడా అలాగే అని.. బేబీ కనిపిస్తే దొరికేటట్టు చేయండని నాగ్ అశ్విన్ ని రిక్వెస్ట్ చేసారు మేకర్స్. ఇది చూసిన నెటిజన్లు అసలు విషయం ఇదా అంటూ షాక్ అయ్యారు. ఇక నరేష్ బ్రహ్మీ నటించిన వీరాంజనేయులు విహారయాత్ర గోవా టూర్ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కింది. అతి త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు