Devara : దేవర లో సీనియర్ స్టార్.. సాంగ్ తో లీకైపోయిందిగా!

Devara : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రాల్లో “దేవర” ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఓ రేంజ్ అంచనాలు పెంచేసిన “దేవర” టీజర్ తో అంచనాలు పది రెట్లు పెంచేసింది. ఇక దేవర సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని నందమూరి అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే దసరా కానుకగా దేవర రిలీజ్ కి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి అందరూ ఎదురుచూస్తున్న ఫస్ట్ లిరికల్ సాంగ్ “ఫియర్ సాంగ్” పేరుతో రిలీజ్ అయి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. అనిరుధ్ సెన్సేషనల్ మ్యూజిక్ కి తోడు, కొరటాల శివ మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్ తో అదిరిపోయాడు. ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ అనుకున్నట్టే, అభిమానుల అంచనాలను అందుకునేలా గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. అనిరుద్ మ్యూజిక్ కి తోడు రామజోగయ్య శాస్త్రి రాసిన అద్భుతమైన లిరిక్స్ ఫ్యాన్స్ కి హైపెక్కిస్తున్నాయి. ఇక ఈ సాంగ్ చూస్తుంటే సినిమాలో మరో క్రేజీ ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ లీక్ అయింది.

దేవర లో సీనియర్ స్టార్.. సాంగ్ తో లీకైంది..

ఇక నిన్న రిలీజ్ అయిన దేవర సాంగ్ యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతుంది. రిలీజ్ అయిన నిమిషాల వ్యవధిలోనే లక్షల లైక్స్ సాధించిన దేవర సాంగ్ అభిమానులకి బాగా ఎక్కేసింది. వీడియో లో స్పెషల్ గా అనిరుద్ బీజీఎమ్ కి, తారక్ స్క్రీన్ ప్రెజెన్స్ కి కొరటాల మార్క్ షాట్స్ కూడా చాలా బాగున్నాయి. “అగ్గంటుకుంది సంద్రం.. భగ్గున మండె ఆకసం.. అంటూ సాగిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి అద్భుతంగా రాసారు. ఇదిలా ఉండగా దేవర సాంగ్ లో ఒక క్రేజీ షాట్ లో స్టార్ నటుడు కనిపించాడు. ఎన్టీఆర్ షిప్ లో విలన్స్ పైకి ఎగిరి కొట్టే షాట్ లో సీనియర్ స్టార్ హీరో శ్రీకాంత్ కనిపించాడు. దీంతో శ్రీకాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిపోయింది. ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోహీరోయిన్లు, విలన్ గురించి తప్ప ఇతర పాత్రల గురించి ఎలాంటి సమాచారం రాలేదు. కానీ తాజాగా ఈ సాంగ్ లో శ్రీకాంత్ కనిపించడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. మరి ఇంకెంత మంది ఈ సినిమాలో ఉన్నారు మేకర్స్ ప్రకటించేవరకు తెలీదు. అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో షైన్ టామ్ చాకో కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.

senior star srikanth playing a key role in devara movie

- Advertisement -

అదిరిపోయిన ఎన్టీఆర్ బర్త్ డే ట్రీట్..

ఇక ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా ఒకరోజు ముందు విడుదల చేసిన ఈ ఫియర్ సాంగ్ ఎన్టీఆర్ కి పర్ఫెక్ట్ ట్రీట్ గా, నందమూరి అభిమానులకి ఒకరోజు ముందే అనిరుద్ గిఫ్ట్ ఇచ్చేసాడని చెప్పాలి. ఇక దేవర (Devara) సాంగ్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే లక్షల లైక్స్ సాధించగా, భారీగా వ్యూస్ కూడా సొంతం చేసుకుంటుంది. ఇక 24 గంటల్లో ఈ పాట ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా, మొదటిభాగం దసరా కానుకగా ఈ ఏడాది రిలీజ్ చేసి, రెండో భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్లో తీసుకురానున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు