Rayaan : రాయన్ సినిమాపై సంచలన దర్శకుడు రెస్పాన్స్

Rayaan : సెల్వ రాఘవన్ ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వాస్తవానికి సెల్వ రాఘవన్ తమిళ దర్శకుడు అయిన కూడా తెలుగు ప్రేక్షకులుకు కూడా సుపరిచితమని చెప్పొచ్చు. సెల్వ రాఘవన్ తెరకెక్కించిన సినిమాలు అద్భుతం. సెల్వ రాఘవన్ కి తెలుగులో కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒక సినిమాను ఇలా కూడా తీయొచ్చు అని సంచలనాత్మకమైన సినిమాలను సెల్వ రాఘవన్ తెరకెక్కించాడు. సెల్వ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అందరి దర్శకులులా కాకుండా తన పంథా వేరు అంటూ నిరూపించాడు. తన అనుకున్న కథని అనుకున్నట్లు చెప్పటం ఆయనకు మాత్రమే చెల్లింది.

“తుళ్లువదో ఇలామై” సినిమా దర్శకుడుగా ప్రారంభమైన సెల్వ రాఘవన్ కెరియర్ లో ధనుష్ తో కొన్ని వరుస సినిమాలను చేశాడు. కాదల్ కొండెన్ , పుదు పెట్టేయ్, మయక్కం ఎన్న వంటి సినిమాలు ధనుష్ తో చేసి దర్శకుడుగా మంచి పేరు అందుకున్నాడు. అయితే సెల్వ రాఘవన్ చేసిన 7జి బృందావన్ కాలనీ సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. 7జి బృందావన్ సినిమాకి ఇప్పుడు చూసిన కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్ గా ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు. ఒక సూపర్ హిట్ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనడానికి ఈ సినిమా సెలబ్రేషన్ నిదర్శనం అని చెప్పొచ్చు.

Dhanush

- Advertisement -

సెల్వ రాఘవన్ దర్శకుడిగా ధనుష్ తో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసాడు. ఇప్పుడు ధనుష్ దర్శకత్వం వహించిన 50వ సినిమాలు సెల్వ రాఘవన్ కూడా శేఖర్ అనే పాత్రలో కనిపించాడు. ఈ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా గురించి సెల్వ స్పందించాడు. స్పెల్బౌండ్ అండ్ మైండ్ బ్లోయింగ్ అంటూ ప్రతి ఫ్రేమ్ సీన్ లో ధనుష్ అద్భుతంగా చేశాడు. ఏఆర్ రెహమాన్ తన మ్యూజిక్ తో వేరే ప్రపంచానికి తీసుకెళ్లాడు అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశంసించాడు సెల్వ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు