Nandamoori Family : నందమూరి ఫ్యామిలీకి చాలా స్పెషల్ కానున్న సెప్టెంబర్

Nandamoori Family : టాలీవుడ్ లో బడా ఫ్యామిలీలలో ఒకటి నందమూరి ఫ్యామిలి. నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్ వేసిన బాటలో ఆయన వారసులు ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. రెండోతరంలో నందమూరి బాలకృష్ణ రామారావు లెగసీని కంటిన్యూ చేస్తుంటే, ఇప్పటితరంలో జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారసత్వాన్ని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా నందమూరి ఫ్యామిలీ (Nandamoori Family) నుండి ఒక్క సినిమాకూడా రాలేదు. బాలయ్య ఏడాది కాలంగా రాజకీయాల్లో ఉంటే, ఎన్టీఆర్ నుండి సినిమా వచ్చి రెండేళ్లయింది. కళ్యాణ్ రామ్ లాస్ట్ సినిమా డిజాస్టర్ అయింది. అయితే ఈ ఏడాది వచ్చే నెల నుండి నందమూరి అభిమానులకు పండగ వాతావరణం వచ్చేస్తుందని చెప్పాలి.

September is a special month for Nandamoori Family

సెప్టెంబర్ లో ఏకంగా మూడు స్పెషల్ డేలు…

ఇక ఈ ఇయర్ సెప్టెంబర్ లో, ఒకే నెల‌లో తమ నందమూరి అభిమాన హీరోల‌కి సంబంధించి ఏకంగా మూడు స్పెష‌ల్ రోజులు వస్తుండడంతో అభిమానుల ఆనందం రెట్టింపవుతుంది. అందులో మొదటిది నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి 50 సంవ‌త్స‌రాలు అవుతుండ‌టంతో, ఈ వేడుక‌ను టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ వారు అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుక‌ను సెప్టెంబ‌ర్ 1వ తేదీన శిల్పకళావేదికలో నిర్వ‌హించ‌నున్నారు. ఇక అలాగే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే సెప్టెంబ‌ర్ 6న నంద‌మూరి మోక్ష‌జ్ఞ పుట్టిన‌రోజు కానుక‌గా, తన డెబ్యూ సినిమాను అనౌన్స్ చేసే అవ‌కాశం ఉంది. ఇక ఆ సినిమాను హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తున్నాడని ఇది వరకే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

నందమూరి ఫ్యాన్స్ స్పెషల్ డే…

ఇక ఫైనల్ గా సెప్టెంబర్ 27న జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘దేవ‌ర’ గ్రాండ్ రిలీజ్ అవుతుండ‌టంతో నందమూరి అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇలా సెప్టెంబర్ లో, ఒకే నెల‌లో నంద‌మూరి హీరోల‌కు సంబంధించి మూడు స్పెషల్ డే లు ఉండ‌టంతో, సెప్టెంబర్ లో సంద‌డి చేసేందుకు నందమూరి అభిమానులు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇక వచ్చే ఏడాది నందమూరి అభిమానుల నుండి అరడజను సినిమాలు రానున్నట్టు టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు