Sharwanand : శర్వానంద్ కి ఈ నటుడు డబ్బింగ్ చెప్పాడని తెలుసా?

Sharwanand : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. సైడ్ రోల్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో, ఆ తరవాత హీరోగా మెయిన్ లీడ్స్ చేస్తూ మంచి సక్సెస్ లు అందుకున్నాడు. ఇక లేటెస్ట్ గా మనమే సినిమాతో ఆడియన్స్ ని పలకరించి మంచి సక్సెస్ ని అందుకున్నాడు. త్వరలో మరిన్ని సినిమాలతో రానున్నాడు. ఇదిలా ఉండగా శర్వానంద్ కెరీర్ బిగినింగ్ లో సైడ్ రోల్స్ లో చిన్న పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ పాత్రల్లో కూడా మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. అయితే శర్వానంద్ అప్పట్లో నటించిన సినిమాలకు శర్వా పాత్రకి వేరే వ్యక్తి డబ్బింగ్ చెప్పాడని తెలుసా? అవును.. ఇది నిజమే. చాలామంది ఇది గమనించలేదు…

Serial actor Kaushik dubbed for Sharwanand's movies

శర్వానంద్ ఈ సినిమాలకు డబ్బింగ్ చెప్పింది ఇతనే…

టాలీవుడ్ లో చాలామంది హీరోలకు ఇతర నటులు హీరోలు వాళ్ళ గొంతు ఇవ్వడం కొత్తేమి కాదు. అప్పట్లో రాజశేఖర్, సుమన్ , రజినీకాంత్ వంటి స్టార్ హీరోలకు సాయి కుమార్ డబ్బింగ్ చెప్పేవారు. ఇక నితిన్ లాంటి హీరోలకి కెరీర్ బిగినింగ్ లో నటుడు శివాజీ డబ్బింగ్ చెప్పాడు. అలాగే శర్వానంద్ కి కూడా ఓ నటుడు కెరీర్ బిగినింగ్ లో డబ్బింగ్ చెప్పాడని చాలామందికి తెలీదు. అతను ఎవరో కాదు బుల్లితెర నటుడు కౌశిక్. ఇతను చాలా టివి సీరియల్స్ లో నటించాడు. అలాగే సినీనటుడు బాలాదిత్యకు స్వయానా అన్న. టెలివిజన్ లో 20స్ లో పద్మవ్యూహం, కళ్యాణి, దేవత వంటి సీరియల్స్ తో తెలుగులో పాపులర్ అయ్యాడు. అలాగే కొన్ని సినిమాలలో కూడా నటించాడు. ఇక శర్వానంద్ కి కెరీర్ బిగినింగ్ లో చేసిన సినిమాలకి కౌశిక్ డబ్బింగ్ చెప్పాడు. శర్వానంద్ నటించిన ఐదో తారీఖు, వీధి చిత్రాలకు కౌశిక డబ్బింగ్ చెప్పడం జరిగింది. అయితే అప్పట్లో ఈ సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. అందువల్ల జనాలకి తెలీలేదు.

- Advertisement -

సీరియల్స్ తో బిజీ అయిన కౌశిక్…

ఇక కౌశిక్ శర్వానంద్ (Sharwanand) నటించిన దాదాపు ఆరు సినిమాలకు డబ్బింగ్ చెప్పానని ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇక గమ్యం నుంచి శర్వానంద్ తనకు తానుగా సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం స్టార్ట్ చేశాడని తెలిపాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు కౌశిక్ సీరియల్స్ లో హీరో,హీరోయిన్లకు అన్న పాత్రలు లేదా తండ్రి పాత్రలు వేస్తూ బిజీగా ఉన్నాడు. అలాగే సినిమాల్లో కూడా అప్పుడప్పుడూ నటిస్తున్నాడు. ఇక శర్వానంద్ హీరోగా ఆల్రెడీ ఈ ఇయర్ మనమే తో సక్సెస్ అందుకోగా, త్వరలో మరో ఫ్యామిలీ స్టోరీతో రానున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు