Lahari : బెంజ్ కారు కొన్న బుల్లితెర హీరోయిన్.. కారు రేంజ్ తెలుసా?

Lahari : బుల్లితెర హీరోయిన్ ‘లహరి’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టెలివిజన్ లో పలు సీరియల్ లలో హీరోయిన్ గా పాపులర్ అయిన ఈ అమ్మాయి ఇప్పటికీ పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. ముద్దుబిడ్డ అనే సీరియల్ తో పాపులర్ అయిన ఈ అమ్మాయి పలు సినిమాల్లో కూడా నటించింది. ఇక సీరియల్స్ తగ్గించినాసోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటుంది ఈ భామ. యూట్యూబ్ లో, ఇంస్టాగ్రామ్ లో వ్లోగ్స్ చేస్తూ సంపాదిస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఫ్యామిలీతో తెగ ఖుషీగా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తుంది. అయితే ఆ ఖుషికి కారణం ఏంటంటే, ఈ సీరియల్ హీరోయిన్ తాజాగా ఓ లగ్జరీ వెంక కారుని కొనుగోలు చేసింది. ఆ విషయాన్నీ తన భర్త, బిడ్డ, ఫ్యామిలీతో కలిసి కొన్న బెంజ్ కారుతో పోజులు ఇస్తూ ఆ కార్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Serial actress Lahari bought a luxury Benz car

బెంజ్ కారు కొన్న లహరి.. కార్ వ్యాల్యూ తెలుసా?

ఇక బుల్లితెర హీరోయిన్ లహరి (Lahari) తాజాగా బెంజ్ కార్ కొనగా, ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. బుల్లితెరపై సీరియల్స్ తో పాపులర్ అయిన లహరి ఇంస్టాగ్రామ్ లో కూడా మంచి ఫాలోవర్లను కలిగి ఉంది. తాజాగా నెట్టింట్లో పోస్ట్ చేసిన ఆ లగ్జరీ కారు వైరల్ అవుతోంది. అయితే ఆ కారు రేంజ్ గురించి సోషల్ మీడియాలో చర్చ కుడుస్తూ ఉంది. అయితే తాజాగా ఈ లగ్జరీ బెంజ్ కారు వ్యాల్యూ గురించి సమాచారం తెలిసింది. Mercedes-Benz C-Class Mileage మోడల్ అయిన ఆ కార్ వ్యాల్యూ అక్షరాలా దాదాపు 80 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇది చూసిన నెటిజన్లు సీరియల్ హీరోయిన్ ఇంత పెద్ద లగ్జరీ కారు కొన్నదంటే ఆస్తులు బాగానే ఉండి ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇంస్టాగ్రామ్ లో లహరికి పలువురు తోటి నటులు, నెటిజన్లు కంగ్రాట్స్ చెప్తూ కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న లహరి..

ఇక బుల్లితెరపై పదికి పైగా సీరియల్స్ లో హీరోయిన్ గా నటించిన లహరి పలు సినిమాల్లో కూడా చిన్న చిన్న రోల్స్ లో నటించింది. ఆరెంజ్, గ్రీకు వీరుడు, డాన్ శీను వంటి సినిమాల్లో మంచి రోల్స్ లో నటించింది. ఇక ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఒక బాబుకి జన్మనిచ్చిన లహరి ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ, యూట్యూబ్ లో, ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ బిజీగా ఉంది. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత సీరియల్స్ లో మళ్ళీ అడుగుపెడతానంటూ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు