Shah Rukh Khan : గోల్డ్ కాయిన్‌పై కింగ్ ఆఫ్ బాలీవుడ్ ప్రతిమ… ఈ ఘనత సాధించిన ఫస్ట్ హీరో షారుఖే

Sharukh Khan.. బాలీవుడ్ బాద్షా ఎప్పటికప్పుడు అరుదైన గౌరవాలను అందుకుంటూనే ఉన్నారు.. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన హీరోగా రికార్డు సృష్టిస్తే.. ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని అందుకొని ఆశ్చర్యపరిచారు. అసలు విషయంలోకి వెళితే బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న హీరోలలో షారుక్ ఖాన్ కూడా ఒకరు.. తన కెరీర్లో ఈయన మరో మైలు రాయిని సాధించారు. ప్రముఖ వ్యక్తుల మైనపు విగ్రహాలకు ప్రసిద్ధి చెందిన ప్యారిస్ లోని గ్రెవిన్ మ్యూజియం షారుక్ ఖాన్ కు అరుదైన గౌరవాన్ని అందించింది. షారుక్ ఖాన్ గౌరవార్థం బంగారు నాణెం పై కింగ్ ఆఫ్ బాలీవుడ్ గా పిలవబడే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రతిమను ముద్రించారు. ఈ ఘనత సాధించిన ఫస్ట్ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కావడం గమనార్హం. ఏది ఏమైనా బంగారు నాణెంపై ఆయన ప్రతిమను ముద్రించి కాయిన్ రిలీజ్ చేయడంపై ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఆయన గౌరవానికి ప్రశంసలు కురిపిస్తోంది.

Shah Rukh Khan: King of Bollywood portrait on gold coin... Shahrukh is the first hero to achieve this feat
Shah Rukh Khan: King of Bollywood portrait on gold coin… Shahrukh is the first hero to achieve this feat

బాలీవుడ్ కింగ్ కి అరుదైన గౌరవం..

నాణానికి రెండు వైపులా బొమ్మ , బురుసు అయితే గ్రెవిన్ మ్యూజియం విడుదల చేసిన ఈ బంగారు నాణెంపై ఒకవైపు షారుఖ్ ఖాన్ ప్రతిమ, మరొకవైపు మ్యూజియం ప్రతిమలు ముద్రించి నాణెం విడుదల చేయడం జరిగింది. బాలీవుడ్ కింగ్ అని తరచుగా పిలవబడే షారుక్ ఖాన్ ఇండియన్ సినిమా పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విజయవంతమైన స్టార్ సెలబ్రిటీల్లో ఒకరిగా మారడానికి ఆయన ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా సినీ పరిశ్రమలో మూడు దశాబ్దాలకు పైగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్నారు షారుక్ ఖాన్.

బ్యాక్ టు బ్యాక్ లో కూడా బ్లాక్ బస్టర్..

గతంలో తన కొడుకు ఆర్యన్ కాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ తర్వాత 2023లో మళ్ళీ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకొని మరోసారి విజయ పరంపర కొనసాగించారు. ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీకి విరామం ప్రకటించినప్పటికీ కూడా ఆయన స్టార్ డం ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి.ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచుకున్నారు.

- Advertisement -

2008లో షారుక్ ఖాన్ మైనపు విగ్రహం..

ఇకపోతే ప్యారిస్ లోని గ్రెవిన్ మ్యూజియంలో 2008 లోనే షారుక్ ఖాన్ మైనపు విగ్రహం తయారు చేశారు. ఈ విగ్రహం ప్రపంచ స్థాయిలో ఆకర్షణ పొందింది.తర్వాత ఆయన గౌరవార్థం బంగారు నాణెం విడుదల చేయాలని ఇటీవలే తీసుకున్న నిర్ణయం మేరకు ఆ గుర్తింపును ఇంకా కొత్త స్థాయికి తీసుకెళ్లింది గ్రెవిన్ మ్యూజియం. సినిమా రంగానికి షారుక్ ఖాన్ చేసిన సేవలకు గుర్తుగా ప్రత్యేక బంగారు నాణాన్ని విడుదల చేయాలని ఫ్రాన్స్ రాజధాని గ్రెవిన్ గ్లాస్ నిర్ణయించింది. ఇక ఆయన ఫోటోతో పాటు ఆయన పేరు కలిగి ఉన్న ఈ నాణెం ప్రపంచవ్యాప్తంగా ఆయన పొందుతున్న అభిమానుల ప్రేమను సూచిస్తుంది. అంతేకాదు అంతర్జాతీయ చిహ్నంగా ఆయన విజయాలను ఆయన హోదాను ఈ నాణెం హైలెట్ చేస్తోందని చెప్పవచ్చు. 2018లో కూడా గ్రెవిన్ మ్యూజియం షారుఖ్ ఖాన్ కు అంతర్జాతీయంగా గుర్తింపు అందివ్వడం కోసం బంగారు నాణెంతో సత్కరించింది. ఏది ఏమైనా ఇలాంటి అరుదైన గౌరవాన్ని అందుకున్న తొలి ఇండియన్ హీరోగా షారుక్ రికార్డు సృష్టించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు