Shahrukh Khan : బాలీవుడ్ బాద్‌షాకి అరుదైన గౌరవం… మొదటి ఇండియన్ యాక్టర్ రికార్డ్

Shahrukh Khan: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇప్పుడు తన సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తూ మంచి ఇమేజ్ దక్కించుకున్నారు. పఠాన్ , జవాన్ సినిమాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన ఈయన.. ఇప్పుడు మరో అరుదైన అవార్డు అందుకోనున్నారు.. అంతే కాదు ఈ అవార్డు అందుకోబోతున్న ఇండియన్ యాక్టర్ గా కూడా రికార్డ్ సంపాదించుకోవడం ఆశ్చర్యకరమనే చెప్పాలి. మరి ఏ విభాగంలో ఆయన మొదటి ఇండియన్ యాక్టర్ గా రికార్డు దక్కించుకున్నారో ఇప్పుడు చూద్దాం.

Shahrukh Khan : A rare honor for the Baadshah of Bollywood... First Indian actor record
Shahrukh Khan : A rare honor for the Baadshah of Bollywood… First Indian actor record

అరుదైన అవార్డు అందుకోబోతున్న షారుఖ్..

లొకర్నో ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ ఆయనను కెరియర్ అచీవ్మెంట్ అవార్డుకు ఎంపిక చేసింది.. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టింది..” షారుక్ లాంటి లివింగ్ లెజెండ్ ను ఆహ్వానించాలని కల నెరవేరింది ఆయన ఒక సూపర్ స్టార్ , ప్రొడ్యూసర్ గా , హీరోగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు అంటూ కొనియాడింది కూడా.. ప్రస్తుతం ఈ పోస్ట్ పై షారుక్ అభిమానులు హర్షం వ్యక్తం చేయడమే కాదు తమ అభిమాన నటుడుకి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. ఇటు సెలబ్రిటీలు కూడా ఈ అవార్డును అందుకోవడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

ఆగస్టు 10వ తేదీన అవార్డు ప్రధానం..

స్విట్జర్లాండ్ లో 77 వ లొకర్నో ఫిలిం ఫెస్టివల్ ఆగస్టు 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగనుంది. ఇక పదవ తేదీన షారుక్ ఖాన్ కి అవార్డు ప్రధానం చేయనున్నారు. ఆయన కెరియర్లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలలో ఒకటైన దేవదాసు చిత్రాన్ని ఈ ఈవెంట్లో ప్రదర్శించనున్నారట. ఇక ఈ పురస్కారానికి ఎంపికైన తొలి భారతీయ నటుడిగా కూడా ఈయనే నిలిచారు.. గతంలో ఫ్రాన్సిస్కో రోసీ, జానీ టో వంటి హాలీవుడ్ ప్రముఖులు మాత్రమే ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇప్పుడు 32 ఏళ్ళ నట ప్రస్థానంలో 100కు పైగా చిత్రాలలో నటించి మెప్పించిన షారుక్ ఖాన్ ఈ అవార్డును అందుకోబోతున్నారు. ఇకపోతే పఠాన్, జావాన్, డంకీ చిత్రాలతో అలరించిన యన ప్రస్తుతం సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఆయన కుమార్తె సుహానా ఖాన్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇక ఈ చిత్రానికి కింగ్ అనే టైటిల్ ని కూడా ఖరారు చేసినట్లు సమాచారం.

- Advertisement -

షారుక్ ప్రయాణం..

షారుక్ ఖాన్ ఎప్పుడూ కూడా అరుదైన రికార్డులనే సృష్టిస్తూ ఉంటారనటంలో సందేహం లేదు.. ఇప్పటికే తన చిత్రాలతో రీఎంట్రీలో కూడా భారీ కలెక్షన్లు సాధిస్తూ ఇండియన్ ఫిలిం యాక్టర్ గా నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న ఈయన.. ఇప్పుడు ఈ అవార్డును దక్కించుకోబోతున్నారు. అంతేకాదు ప్రాపర్టీ విషయంలో కూడా ఈయనే నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. దాదాపు రూ .3 వేల కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టి అత్యధిక ధనవంత హీరోగా పేరు దక్కించుకున్నారు షారుఖ్ ఖాన్. ఇకపోతే ప్రస్తుతం ఈయన వారసుడు ఆర్యన్ ఖాన్ ను కూడా తనలాగే ఉన్నత స్థాయిలో నిలబెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు