Shahrukh Khan: షారుఖ్ ఖాన్ కంటే నా రెమ్యూనరేషన్ ఎక్కువ, లేడీ డైరెక్టర్ సంచలన కామెంట్స్

కొందరు జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరు ఊహించలేరు. అప్పుడు చిన్న నటుడుగా మొదలుపెట్టిన చాలామంది ఇప్పుడు స్టార్ హీరోలు కూడా అయ్యే రేంజ్ కు వెళ్లారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేసిన చాలామంది ఈరోజు సూపర్ స్టార్ అయ్యారు. అయితే మన టాలెంట్ అనేది ప్రతిదానికి నిదర్శనం అని చెప్పాలి. ఇకపోతే బాలీవుడ్ కింగ్ కాంగ్ షారుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ షారుక్ ఖాన్ కి ఉంది. షారుక్ బాలీవుడ్ లో చేసిన ఎన్నో సినిమాలకు తెలుగు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు. 2023 వ సంవత్సరం షారుక్ కి బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు రెండు వెయ్యి కోట్లకు పైగా సినిమాలు అదే ఏడాదిలో వచ్చాయి. ఈ ఏడాది కూడా ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది షారుక్ టీం.

షారూఖ్ ఖాన్ కంటే కొరియోగ్రాఫర్, దర్శకురాలు అయిన ఫరా ఖాన్ ఎక్కువ సంపాదించాను అని చెప్పుకుంటున్నారు. షారూఖ్ ఖాన్ చేసినది మొదటి సినిమా వేరే అయినా కూడా తొలిసారి వెండితెరపై కనిపించింది దీవానా సినిమాలో. కానీ అతడు ఫస్ట్ సంతకం చేసిన సినిమా మాత్రం కబీ హా కబీ. తొలిసారి కెమెరా ముందుకు వచ్చిందీ ఈ సినిమాకే. ఈ సినిమాకు ఫరా ఖాన్ కొరియోగ్రాఫర్ చేశారు.

Om Shanti Om

- Advertisement -

రీసెంట్ గా ఫరా ఖాన్ ఆ సినిమాకు సంబంధించిన విశేషాలను చెప్పుకొచ్చింది. కబీ హా కబీ నా తక్కువ బడ్జెట్లోనే పూర్తి చేశారు. ఈ సినిమాకుగానూ షారూఖ్ ఖాన్ కు రూ.25,000 ఇచ్చారు. అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ నాకే ఇచ్చారు. ఎలా అంటే ఒక్క పాటకు రూ.5,000 చొప్పున ఆరు పాటలకుగానూ రూ.30,000 ఇచ్చారు. అప్పట్లో అసిస్టెంట్ పెట్టుకునేంత సీన్ కూడా లేదు. కాబట్టి ఆ జీతం అంతా నేను మాత్రమే తీసుకున్నాను. పైగా ఆనా మేరే ప్యార్ కో పాట కోసం బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్లకు బదులుగా గోవాలో ఉన్న జనంతోనే షూటింగ్ కానిచ్చేశాం అని తెలిపింది.

ఈ సినిమా నుంచే షారూఖ్- ఫరా ఖాన్ మధ్య స్నేహ బంధం ఏర్పడింది. ఫరా ఖాన్ దర్శకత్వంలో షారూఖ్.. మై హూనా, ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్ వంటి చిత్రాల్లో నటించాడు. వీటన్నిటిని మించి ఓంశాంతి ఓం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పునర్జన్మ అనే కాన్సెప్ట్ లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ చాలామందికి ఒక ఫేవరెట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు