Shalini Pandey : అర్జున్ రెడ్డి హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. అతనితో ఇంటిమేట్ చేసేప్పుడు భయమేసింది!

Shalini Pandey : టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా వైరల్ అయిన హీరోయిన్ “షాలిని పాండే”. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ కి జోడిగా నటించిన ఈ హీరోయిన్ ఆ సినిమాతో తెలుగు ఆడియన్స్ యూత్ క్రష్ లిస్ట్ లో చేరిపోయింది. అయితే అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత కూడా ఈ అమ్మాయికి పెద్దగా ఆఫర్లు పలకరించలేదు. మహానటి, కథా నాయకుడు, ఇద్దరి లోకం ఒకటే వంటి అడపాదడపా చిత్రాల్లో నటించింది. అయితే కెరీర్ బిగినింగ్ లో మంచి ఆఫర్లు వచ్చినా, రోల్స్ నచ్చక రిజెక్ట్ చేసిందట. ఇక చివరగా తెలుగులో నిశబ్దం అనే సినిమాలో నటించింది షాలిని. అయితే తెలుగులో పెద్దగా ఆఫర్లు రాకపోయే సరికి బాలీవుడ్ చెక్కేసింది షాలిని. ఇక ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉ‍న్న షాలిని పాండే రీసెంట్ గా “మహారాజ్” అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా ఓటిటి లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Shalini Pandey Interesting Comments on Maharaj Movie

మహారాజ్ లో నటించిన షాలిని..

ఇక “మహారాజ్‌” (Shalini Pandey) మూవీలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించగా, షాలిని పాండే హీరోయిన్ గా నటించింది. సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన మహారాజ్‌ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమా ఓటిటి లో డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకోగా, ఈ సినిమా కోసం ఓ ఇంటర్వ్యూకు హాజరైన షాలిని పాండే పలు సంచలన వ్యాఖ్యలు మాట్లాడింది. ఈ సినిమా 19వ శతాబ్దానికి చెందిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంది. గత వారం జూన్ 21న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన మహారాజ సినిమాలో అందరూ బాగా నటించారని చెప్పాలి. తొలి సినిమా అయినా జునైద్ ఖాన్ చక్కగా పెర్ఫార్మ్ చేసాడు.

- Advertisement -

ఇంటిమేట్ సీన్ కి భయమేసింది…

ఇక మహారాజ్ సినిమాలో షాలిని పాండే హీరోయిన్ గా కిషోరి అనే పాత్రలో నటించింది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండే ఈ మూవీలో ఒక ఇంటిమేట్ సీన్ ఉంటుంది. ఆ సీన్ లో షాలిని పాండే హీరోతో కలిసి నటించగా, ఆ సన్నివేశానికి సంబంధించి ఆసక్తికర విషయాలని పంచుకుంది. ఇక షాలిని పాండే ఆ సీన్‌ చేసేటప్పుడు ఆకస్మాత్తుగా బయటకు వెళ్లానని తెలిపింది. అయితే అది తనపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలియదు కానీ.. నాకు చీకటి గదిలో ఉండాలంటే భయమని షాలిని చెప్పుకొచ్చింది. ఇక షాలిని తనకు కొంత సమయం, ప్రశాంతమైన వాతావరణం కావాలని డైరెక్టర్‌ ను అడిగానని చెప్పుకొచ్చింది. ఇక షాలిని పాండే తెలుగులో మాత్రం ఇప్పటివరకూ మరో సినిమా చేయలేదు. హిందీలోనే అదృష్టాన్ని పలకరించే ప్రయత్నంలో ఉన్నది. ఇక షాలిని పాండే తెలుగులో సినిమాలు చేయకపోతున్నా, అప్పుడప్పుడూ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లలో, సందడి చేస్తూ ఉంటుంది షాలిని.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు