Shalini Pandey: ఆ రోజులను గుర్తు చేసుకుంటున్న- అర్జున్ రెడ్డి బ్యూటీ ఆసక్తికర పోస్ట్

Shalini Pandey

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచమైన షాలిని పాండే అందరికి గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే అర్జున్ రెడ్డి సినిమాలో ఆమె నటన.. అమాయకత్వమైన చూపులు.. అర్జున్ రెడ్డి పట్ల ఆమెకున్న విపరీతమైన ప్రేమ.. అన్నింటికి మించి ఆమె అందం.. ఇవన్నీ క్వాలిటీస్ షాలిని పాండే ను తెలుగు ప్రేక్షకులు చిరకాలం గుర్తుపెట్టుకునేలా చేసాయి.

ఇక మొదటి సినిమానే తెలుగులో కల్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను చూసిన షాలిని ఎందుకనో తెలుగులో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. సర్లే అందరికి ఆ స్టార్ హీరోయిన్ అర్హత కలిసిరాదనుకున్న కానీ చేతినిండా సినిమా అవకాశాలైన రావాలి. కానీ షాలినిపాండే విషయంలో అది కూడా జరగలేదు. అర్జున్ రెడ్డి సినిమా తరువాత మహనటి, కథానాయకుడు కళ్యాణ్ రామ్ తో 118, నిశ్యబ్దం సినిమాలలో నటించిన షాలిని ఇక ఆ తరువాత నుంచి తెలుగు తెరపై కనిపించలేదు. దాంతో అంత ఈ బ్యూటీని మర్చిపోయారు.

ఇక లేటెస్ట్ గా షాలిని పాండే.. తన ఇంస్టాగ్రామ్ లో ఒక రీల్ షేర్ చేస్తూ తన స్నేహితురాలు హీరోయిన్ రితిక సింగ్ తో ఆమె గడిపిన రోజులను గుర్తు చేసుకుంది. ఈ మధ్య అప్పుడప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ జనాల్లో క్రేజ్ కోసం షాలిని గట్టిగానే ప్రయత్నిస్తున్న కూడా ఇండస్ట్రీ మాత్రం ఆమె వంక చూడట్లేదనే చెప్పాలి. ప్రస్తుతం బాలీవుడ్ లో మహారాజ అనే సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ కెరీర్ ముందు ముందు ఎలా ఉండబోతుందో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు