Shankar: అప్పట్లోనే సినిమాటిక్ యూనివర్స్ ని ఊహించిన సౌత్ ఇండియన్ డైరెక్టర్

Shankar: ఒకప్పుడు తెలుగు ఆడియన్స్ అంతా కూడా తెలుగు దర్శకులను తక్కువ చేస్తూ హాలీవుడ్ సినిమా హాలీవుడ్ సినిమా అంటూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా కూడా దాదాపు హాలీవుడ్ స్థాయిని అందుకుంది అని చెప్పొచ్చు. తెలుగులో ఒక భారీ సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే హాలీవుడ్ సైతం తెలుగు సినిమా వైపు చూసే రోజులు వచ్చాయి. ఎన్నో తెలుగు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం మొదలుపెట్టాయి. తెలుగులో చాలామంది యంగ్ ఫిలిం మేకర్స్ గొప్ప గొప్ప సినిమాలు తీస్తూ ఉన్నారు.

లోకేష్ సినీమెటిక్ యూనివర్స్

ఇక రీసెంట్ టైమ్స్ లో హాలీవుడ్ మాదిరిగానే తెలుగులో కూడా సినీమాటిక్ యూనివర్స్ అంటూ సినిమాలు చేస్తున్నారు కొంతమంది దర్శకులు. నగరం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దర్శకుడుగా ఇంటర్వ్యూ ఇచ్చాడు లోకేష్. ఆ సినిమా తర్వాత చేసిన ఖైదీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత విజయ్ విజయ్ సేతుపతి హీరోగా మాస్టర్ అనే సినిమాను తీశాడు. కమల్ హాసన్ తో విక్రమ్ అనే సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు లోకేష్. అయితే విక్రమ్ సినిమా చూసేముందు ఒకసారి ఖైదీ సినిమా చూడండి అంటూ ముందు రోజు ట్విస్ట్ ఇచ్చాడు. అయితే విక్రమ్ సినిమా చూసిన తర్వాత చాలామంది ప్రేక్షకులకి సినీమాటిక్ యూనివర్స్ లో ఈ సినిమా రాబోతుంది అని అర్థమైంది.

ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్

ఇక తెలుగులో కూడా హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేశాడు. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జై హనుమాన్ అనే సినిమాను చేసే పనిలోపడ్డాడు ప్రశాంత్. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన భారీ బడ్జెట్ సినిమా కల్కి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ తో ముందుకు సాగుతుంది. ఈ సినిమా కూడా సినీమెటిక్ యూనివర్సల్ రాబోతున్నట్టు నాగ్ అశ్విన్ అనౌన్స్ చేశాడు.

- Advertisement -

Shankar Shanmugam

శంకర్ సినిమాటిక్ యూనివర్స్

ఇక అసలు విషయానికి వస్తే దర్శకుడు శంకర్ 2008 లోనే సినీమెటిక్ యూనివర్స్ ఆలోచించినట్లు తెలిపాడు. రోబో” తెరకెక్కిస్తున్న సమయంలో తనకి ఒక ఐడియా వచ్చిందట. అప్పటికే చేసిన “శివాజీ” లో రజినీకాంత్ అలాగే “ఒకే ఒక్కడు” హిందీ వెర్షన్ హీరో అనీల్ కపూర్ పాత్ర ఇంకా భారతీయుడు నుంచి కమల్ పోషించిన సేనాపతి మూడు పాత్రలు కలిస్తే ఎలా ఉంటుందో అనే ఐడియా ని తన అసిస్టెంట్స్ కి చెప్పానని తెలిపారు. కానీ చెప్పిన స్టోరీ పై అసిస్టెంట్లు అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం వలన ఈ సినిమా వర్కౌట్ అవ్వదు అని వదిలేశాడట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు