Shankar: ఇండియన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ గురించి శంకర్ ఏమి చెప్పాడో తెలుసా

Shankar: ఆర్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి ఇప్పటివరకు ఒక కంప్లీట్ సినిమా రాలేదు. కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఆ సినిమాలో కనీసం చరణ్ పాత్ర కూడా ఆడియన్స్ కి సంతోషాన్ని ఇవ్వలేదు. అయితే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమాను చేస్తున్నాడు అని విన్నప్పుడు చాలామందికి హ్యాపీగా అనిపించింది. ఆ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు అసంతృప్తిగానే ఉన్నారు అభిమానులు. దీని కారణం శంకర్ ఒకేసారి రెండు ప్రాజెక్టుల పైన మైండ్ పెట్టడం. ఆల్మోస్ట్ ఒక ప్రాజెక్ట్ ను రిలీజ్ కి సిద్ధం చేయడం వంటి కారణాలను చెప్పొచ్చు.

ఇకపోతే రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు కథను అందించాడు. మామూలుగా కథను రాసుకున్నప్పుడు కార్తీక్ సుబ్బరాజు తన కోసమే రాసుకున్నాడు కానీ కథ పూర్తి అయిన తర్వాత ఇది శంకర్ సార్ లెవెల్ లో ఉంది అని ఫీల్ అయ్యి ఆ కథను శంకర్ అందించాడు. ఇకపోతే గేమ్ చేంజర్ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇదివరకే జరగండి అని ఒక పాట కూడా రిలీజ్ అయింది.

Game Changer

- Advertisement -

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ తుది దశకు చేరింది. రామ్ చరణ్ కి సంబంధించి షూటింగ్ ఆల్రెడీ పూర్తయిపోయింది. ఇండియన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శంకర్ మాట్లాడుతూ రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందని, తనలో ఏదో కనిపించని పవర్ ఉంది అని శంకర్ తెలిపారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారని చాలామంది ఊహించారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా గురించి రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. దీని గురించి త్వరలో అధికారక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు