GameChanger : ఇంక పది రోజులే… ఎన్ని నెలలు ఇదే డైలాగ్ చెప్తారు సార్..?

GameChanger : టాలీవుడ్ లో మూవీ లవర్స్ ఏళ్లగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది “గేమ్ ఛేంజర్” అనే చెప్పాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ షణ్ముగం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ మెంట్ అయి కూడా నాలుగేళ్ల పైనే అయింది. మొదలుపెట్టి కూడా మూడేళ్లు దాటింది. అయినా ఇప్పటికి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. అప్పుడెప్పుడో దిల్ రాజు ఏడాదిన్నర కింద సినిమా 70 శాతానికి పైగా పూర్తయిందన్నాడు. కానీ శంకర్ మాత్రం సినిమాని ఇంకా చిక్కుతునే ఉన్నాడు. కొన్ని నెలల తరబడి గేమ్ చేంజర్ వాయిదాల పర్వం కంటిన్యూ చేస్తూనే ఉంది. కర్ణుడి చావుకు సవాలక్షా కారణాలన్నట్టు ఈ సినిమా వాయిదాపడడానికి కారణాలు చాలానే ఉన్నా, వాటన్నిటికీ బాధ్యుడు మాత్రం శంకరే. తాను ఎప్పుడైతే గేమ్ ఛేంజర్ ని పక్కన బెట్టి ఇండియన్2 మొదలుపెట్టాడో అప్పటినుండి గేమ్ చేంజర్ రిలీజ్ గురించి పట్టించుకోవడం మానేసాడు శంకర్. మధ్య మధ్యలో షూటింగ్ చేస్తున్నా, ప్రస్తుతానికి ఫోకస్ మాత్రం ఇండియన్2 పైనే పెట్టాడు.

Shankar gave an update about GameChanger movie

ఇక పది రోజులే నట.. నెలలతరబడి సేమ్ డైలాగ్…

ఇక రామ్ చరణ్ అయితే షూటింగ్ ఉన్నప్పుడు వెళ్లి షూట్ చేస్తున్నాడు వస్తున్నాడు. కానీ రిలీజ్ విషయం మాత్రం దర్శక నిర్మాతల పై ఆధారపడి ఉంటుంది. కానీ దిల్ రాజు మాత్రం పట్టించుకోవడమే మానేసాడు అన్నట్టుంది పరిస్థితి. ఇక శంకర్ ఈ మధ్యనే ఇండియన్2 పూర్తి చేసి రిలీజ్ ప్రమోషన్లలో ఉన్నాడు. జులై 12న ఇండియన్ 2 సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా కోసం ఇటు శంకర్, అటు కమల్ హాసన్ వరుస ఇంటర్వ్యూ లు ఇస్తూ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలో శంకర్ ని గేమ్ ఛేంజర్ (GameChanger ) అప్డేట్ పై అడిగారు యాంకర్. దీనికి శంకర్ సమాధానమిస్తూ… గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని, ఇంకో పది పదిహేను రోజులే వర్క్ మిగిలి ఉందని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ఎన్ని రోజులు చెప్తారు సార్..

అయితే శంకర్ నుండి ఈ రిప్లై చూసిన చరణ్ ఫ్యాన్స్ నెట్టింట ఫైర్ అవుతున్నారు. ఇంకా ఇదే డైలాగ్ ఎన్ని నెలల నుంచి చెబుతారు సార్ అంటూ శంకర్ మీద ట్రోలింగ్ చేస్తున్నారు. అదీ గాక ఆ ఇంటర్వ్యూ లో గేమ్ ఛేంజర్ గురించి, రామ్ చరణ్ గురించి ప్రస్తావించినప్పుడు పెద్దగా ఆసక్తికనబరచలేదు శంకర్. దీన్ని బట్టి శంకర్ కి గేమ్ ఛేంజర్ పై ఇంట్రస్ట్ పోయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి వీటన్నికి శంకర్ ఏం సమాధానం చెప్తాడో అని చరణ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఇండియన్2 రిలీజ్ అయ్యాకే శంకర్ గేమ్ ఛేంజర్ ప్రస్తావన తీసుకొచ్చే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు