Shankar: భారతీయుడు 2 సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన కమల్ హాసన్

Shankar: శంకర్ దర్శకత్వంలో వచ్చిన ప్రతిష్టాత్మకమైన చిత్రం భారతీయుడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఎప్పుడో మొదలైన ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోలేదు. ఈ సినిమా జరుగుతున్న తరుణంలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. ఒకసారి ఈ సినిమా సెట్ కాలిపోవడం జరిగింది. ఈ సినిమాకు సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా మరణించారు.

భారతీయుడు 2 సినిమాతో పాటు గేమ్ చేంజర్

అయితే ఈ సినిమా ప్రాజెక్ట్ దాదాపు ఆగిపోతుంది అని వార్తలు కూడా వినిపించాయి. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ పూర్తయిపోయింది. అయితే ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో పాటుగా తెలుగులో గేమ్ చేంజర్ అనే సినిమాను చేస్తున్నాడు దర్శకుడు శంకర్. అయితే గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు సరైన క్లారిటీ లేదు. ఆ సినిమా ఇంకా పూర్తి కాలేదు గేమ్ చేంజర్ సినిమా మొదలై దాదాపు మూడు సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఆ షూటింగ్ సంబంధించి 25% పెండింగ్ లో ఉంది. అయితే ఆ సినిమాకు సంబంధించి దాదాపు 60 కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లింది అని కథనాలు వినిపించాయి. ఇకపోతే ఆ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే వార్తలు వినియించాయి. అయితే ఇప్పుడు ఆ సినిమా అక్టోబర్లో వస్తుందో లేదో క్లారిటీ కూడా లేదు.

భారతీయుడు రిలీజ్

ఇక భారతీయుడు సినిమా విషయానికి వస్తే భారతీయుడు 2 సినిమా షూటింగ్ పూర్తి అయిపోయింది. సినిమా జులై నెలలో రిలీజ్ కి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా మొత్తం కాకుండా భారతీయుడు 2 మాత్రమే రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమాకి భారతీయుడు 3 కూడా ఉంది అని వార్తలు వస్తున్నాయి. అయితే మరో ఆరు నెలల్లో ఆ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు కమల్ హాసన్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో తెలిపారు. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి.

- Advertisement -

Indian 2 - Kamal Haasan

భారతీయుడు 2 విజయాన్ని బట్టి భారతీయుడు 3

భారతీయుడు 2 ఏ మేరకు విజయాన్ని సాధిస్తుందో దాన్నిబట్టి భారతీయుడు 3 సినిమా ఉండబోతుంది. అలానే ఆ సినిమాకి సంబంధించి ఆ ట్రైలర్ ని కూడా భారతీయుడు 2 సినిమా క్లైమాక్స్ లో యాడ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనుంది చిత్ర యూనిట్. ఈ సినిమాలో సిద్ధార్థ నారాయణ కూడా ఒక కీలకపాత్రలో కనిపించనున్నాడు. శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ సినిమాలో నటించాడు సిద్ధార్థ. అయితే భారతీయుడు సినిమా ఆ టైంలో అద్భుతమైన హిట్ సాధించడం వలన ఇప్పుడు భారతీయుడు 2 సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. అయితే రోజులు మారుతున్న కొద్దీ ఒక ఐడియా అనేది పాతగా అయిపోతుంది. అయితే ఎప్పుడో మొదలుపెట్టిన ఈ సినిమా రీసెంట్ గానే పూర్తయింది. అయితే అప్పటికి ఆ కథ కొత్తగా అనిపించొచ్చు, కానీ ఇప్పుడు ఆ కథ ఎలా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ కథను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు