Shankar: ఇది కదా విజన్ అంటే, శంకర్ ఇవి వర్కౌట్ చేస్తే ఇండియన్ సినిమా ఎక్కడో ఉంటుంది

Shankar: దాదాపు 17 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసి, 1993లో జెంటిల్మెన్ అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శంకర్. ఆ తర్వాత ఎన్నో సంచలనాత్మకమైన హిట్ సినిమాలను సౌత్ సినిమా ఇండస్ట్రీకి అందించాడు. శంకర్ సినిమా అంటే బీభత్సమైన అంచనాలు ఉంటాయి. ఇప్పుడు అంతా పాన్ ఇండియా పాన్ ఇండియా అని అనుకుంటున్నాము కానీ ఒకప్పుడు శంకర్ చేసిన సబ్జెక్ట్స్ అన్ని పాన్ ఇండియా లెవెల్ లో ఉండేవి.

శంకర్ సినిమా అంటేనే ఒక ప్రత్యేకమైన వైబ్ ఉంటుందని చెప్పొచ్చు. కమర్షియల్ అంశాలతో పాటు సమాజానికి ఒక మెసేజ్ ని అందిస్తాయి శంకర్ సినిమాలు. జెంటిల్మెన్ సినిమా తర్వాత ప్రేమికుడు భారతీయుడు వంటి సినిమాలు అద్భుతమైన ఘన విజయాలను సాధించుకున్నాయి. అయితే పేరుకు తమిళ్ దర్శకుడు అయినా కూడా తెలుగులో కూడా శంకర్ కి మంచి పాపులారిటీ ఉంది.

తెలుగులో శంకర్ గేమ్ చేంజెర్ అనే సినిమాను చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా కంటే ముందు తమిళ్ లో శంకర్ భారతీయుడు 2 సినిమాని ఫినిష్ చేశాడు. ఈ సినిమా జులై 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు శంకర్. ఇకపోతే శంకర్ తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ యొక్క ఐడియాలను రివిల్ చేశాడు.

- Advertisement -

INDIAN 2

తన దగ్గర ఒక హిస్టారికల్ బేస్డ్ సబ్జెక్టు ఉందని, అలానే జేమ్స్ బాండ్ కైండ్ ఆఫ్ సినిమా కూడా ఒకటి ఉందని, అంటే యాజ్ ఇట్ ఇస్ జేమ్స్ బాండ్ లా కాకుండా ఆ టైప్ ఆఫ్ సినిమా ఒకటి శంకర్ ప్లాన్ చేశాడు, అలానే సైన్స్ ఫిక్షన్ మూవీ కూడా శంకర్ మైండ్ లో ఉన్నట్లు చెప్పాడు. అయితే ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి సంబంధించి 2012 అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు. ఏదేమైనా ఇవన్నీ కూడా బిగ్ బడ్జెట్ మూవీస్ అని హై విఎఫ్ఎక్స్ ఉండాలని చెప్పుకొచ్చాడు. అయితే శంకర్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడో పాన్ ఇండియా కాన్సెప్ట్ సినిమాలు చేశాడు శంకర్. ఇప్పుడు శంకర్ రీవిల్ చేసిన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చూస్తుంటే భారతీయ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు