Kollywood : నవలలే ఆధారమా ?

సినీ ప్రపంచం గతంలా లేదు. కరోనా మహమ్మారి తర్వాత వేగంగా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం ఒక సినిమా హిట్ కావాలంటే, నిర్మాతలు పెట్టిన డబ్బులు తిరిగి రావాలంటే చాలా అద్భుతాలు జరగాలి. ఇప్పటి వరకు రాని కథ, కథాంశం ఉండాలి. హీరో ఎలివేషన్స్, క్యారెక్టర్స్ భారీ స్థాయిలో ఉండాలి. అన్నింటికీ మించి మంచి కంటెంట్ ఉండాలి. ఇలా ఉంటే సక్సెస్ అవుతుందా అని గ్యారంటీ కూడా లేదు. ఇటీవల కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా, కమర్షియల్ గా హిట్ కాలేకపోతున్నాయి.

దీంతో అరవనాట సీనియర్ దర్శకులు కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ ను ఇలాంటి పరిస్థితుల్లోనే తీసుకువచ్చారు. నిజానికి పొన్నియిన్ సెల్వన్ ను మణిరత్నం ఎప్పుడో చేయాల్సింది. కానీ అప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు ప్రజలు పొన్నియిన్ సెల్వన్ లాంటి స్టోరీలనే ఆదరిస్తున్నారు. ఇది బాహుబలి నుంచి ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ కూడా కొంత మందిని కదిలిస్తుంది. కొత్తగా కథలు రాయడం కంటే ఇలాంటి జనాదరణ ఉన్న నవలలను ఆధారంగా చేసుకుని సినిమాలు చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు.

ఇలా తెరపైకి మరో అరవ నవల వచ్చింది. కోలీవుడ్ క్రియేటీవ్ డైరెక్టర్ శంకర్ ఈ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. తమిళనాటలో ఎంతో ఆదరణ ఉన్న వేల్పరి అనే నవలను ఆధరంగా చేసుకుని శంకర్ ఒక సినిమా చేయబోతున్నారట. ఈ నవలలో కూడా ప్రేక్షకులకు కావాల్సిన యాక్షన్, రాజకీయ కోణం, సెంటిమెంట్, లవ్ ట్రాక్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో ఈ వేల్పరి నవలతో వచ్చే సినిమా కూడా బిగ్ హిట్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

అయితే ఈ నవల నిడివి చాలా పెద్దది. అందుకే దీన్ని మూడు భాగాలుగా తెరకెక్కించాలని శంకర్ ఆలోచిస్తున్నాడు. హీరోగా రణ్ వీర్ సింగ్ ను ఎంపిక చేశారని టాక్. నిజానికి శంకర్-రణ్ వీర్ కాంబినేషన్ లో అపరిచితుడు హిందీ రీమేక్ జరగాలి. కానీ అనూహ్యంగా ఈ వేల్పరి తెరపైకి వచ్చింది. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభించి, 2024లో మొదటి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ వేల్పరి నవల ఆధారిత సినిమా, పొన్నియిన్ సెల్వన్ లా హిట్ కొడుతుందో లేదో చూడాలి.

Previous article
Next article

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు