Shanmukh Jaswant : ఎన్నోసార్లు చావు అంచు వరకూ వెళ్ళా.. చస్తే ఎవరూ పట్టించుకోరు..!

Shanmukh Jaswant.. తొలుత యూట్యూబర్ గా తన జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టిన షన్నూ అలియాస్ షన్ముఖ్ జస్వంత్ .. మొదట షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.. యూట్యూబర్ గా మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న ఈయన అదే క్రేజ్ తో బిగ్ బాస్ షో కి అడుగు పెట్టాడు.. ఈ షో ద్వారా నెగిటివిటీ మూటగట్టుకున్నారు.. అంతేకాదు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టకు ముందే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎక్కువగా ట్రోలింగ్ ఎదుర్కొన్న షణ్ముఖ్ కు బిగ్ బాస్ షో తో అయినా ఇమేజ్ మారుతుంది అంటే.. మరింత నెగిటివిటీ మూటగట్టుకోవడం గమనార్హం.సిరి – షణ్ముఖ్ లో వ్యవహారం తేడా కొట్టేసింది.. దీంతో ఈయనను ఘాఢంగా ప్రేమించిన దీప్తి కూడా వదిలేసింది. అయితే ఆయన మాత్రం ఇంకా ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చినట్టు కనిపించడం లేదు. మామూలు మనిషి అవుతాడు అనుకునే లోపే డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు.. ఇలా షణ్ముక్ కి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది .దీంతో సోషల్ మీడియాలో ఈయనకున్న పేరు కూడా పోయేలా కనిపిస్తోంది..

Shanmukh Jaswant: I went to the brink of death many times.. nobody cares if I die..!
Shanmukh Jaswant: I went to the brink of death many times.. nobody cares if I die..!

సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. కానీ..

ఈ క్రమంలోనే తాజాగా ఈయన చేసిన పోస్ట్ చూస్తే ఎవరైనా సరే కన్నీటిని పెట్టుకోవాల్సిందే.. సి ఏ స్టూడెంట్ల కోసం ఎవరో పెట్టిన ఆ పోస్ట్ ని షేర్ చేశాడు షణ్ముఖ్.. పిల్లల మీద చదువులు, ఉద్యోగాలు అంటూ ఒత్తిడి పెంచకండి.. తల్లిదండ్రులు తమ తమ పిల్లలతో స్నేహ పూర్వకంగా ఉండండి.. మనసు విప్పి మాట్లాడండి.. సమస్యలను తెలుసుకోండి అంటూ సూచిస్తూ ఈ విధంగా ఒక పోస్ట్ చేశాడు ఒక నెటిజన్.. ఈ పోస్ట్ మీద షణ్ముఖ్ స్పందించాడు.. ఇది కేవలం స్టూడెంట్ లకు మాత్రమే కాదు.. అందరికీ వర్తిస్తుంది.. నా వ్యక్తిగత అనుభవంతో నేను పంచుకుంటున్నాను.. నాకు కూడా ఎన్నోసార్లు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయి.. అలా ఎన్నోసార్లు అనిపించింది.. అయితే అలా చచ్చిపోతే ఎవరూ పట్టించుకోరు.. ఈ ప్రపంచమే మనల్ని మరిచిపోతుంది..

సమస్య ఒక రోజులో తీరిపోదు.. మరింత స్ట్రాంగ్ అవ్వాలి..

మన తల్లిదండ్రులు తప్ప మనల్ని ఎవరు కేర్ చేయరు.. దయచేసి తల్లిదండ్రులతో మీ సమస్యలను చెప్పుకోండి.. తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారు..? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి.. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఉండే బంధుత్వమే బాంధవ్యాలను కాపాడుతుంది.. అంటూ తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు.. ఈ జీవితం అంటేనే ఇంత.. ఆ దేవుడు పరీక్షలు పెడుతూనే ఉంటాడు.. కష్టాలను భరించాలి.. ఎదుర్కోవాలి.. ఇలా స్ఫూర్తి నింపే మాటలను చెప్పుకొచ్చాడు షణ్ముఖ్. ఈ జీవితంలో నేను నేర్చుకున్న పాఠం ఒకటే స్ట్రాంగ్ గా ఏదైనా సాధించగలను అనే మంత్రాన్ని జపించాలి.. మెంటల్ హెల్త్ అనే సమస్య ఒకరోజులోనే తీరిపోయే సమస్య కాదు.. సమయం పడుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనం మరింత స్ట్రాంగ్ అవ్వాలి అంటూ తెలిపారు షణ్ముఖ్. ఇక ప్రస్తుతం షణ్ముఖ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు