Shanmukh Jaswanth : హీరోగా షణ్ముఖ్ ఎంట్రీ… ప్రముఖ దర్శకుడి సపోర్ట్

Shanmukh Jaswanth : బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ బయటకు రాగా, ఈ మూవీ కోసం షణ్ముఖ్ కు స్టార్ డైరెక్టర్ సపోర్ట్ గా తెలుస్తోంది. మరి ఆ డైరెక్టర్ ఎవరు ? షణ్ముఖ్ ఫస్ట్ మూవీ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

షణ్ముఖ్ ఫస్ట్ మూవీ లాంచ్

షణ్ముఖ్ హీరోగా నటిస్తున్న మూవీకి సంబంధించిన లాంచ్ ఈవెంట్ ఈరోజు గ్రాండ్ గా జరిగింది. అయితే ఇది థియేట్రికల్ మూవీ కాదు వెబ్ ఫిలిమ్. ఇందులో షణ్ముఖ్ జస్వంత్ హీరోగా నటిస్తుండగా, అనఘా అజిత్ హీరోయిన్ గా కన్పించబోతోంది. పవన్ కుమార్ ఈ వెబ్ ఫిలింను డైరెక్ట్ చేస్తుండగా, శ్రీ అఖియాన్ ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈటీవీలో స్ట్రిమింగ్ కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన మొదటి షార్ట్ ని సుబ్బు డైరెక్ట్ చేయగా, బెక్కం వేణుగోపాల్ క్లాప్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే షణ్ముఖ్ మూవీకి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, బెక్కెం వేణుగోపాల్, ప్రవీణ్ కాండ్రెగుల హాజరయ్యారు.

ప్రముఖ దర్శకుడి సపోర్ట్

ఎట్టకేలకు షణ్ముఖ్ జశ్వంత్ హీరోగా ఓ మూవీ రాబోతోంది అని అభిమానులు సంబరపడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటకు వచ్చింది. షణ్ముఖ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ఓ ప్రముఖ దర్శకుడు సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు వివేక్ ఆత్రేయ. ఆయన ఈ మూవీకి స్క్రిప్ట్ అందించినట్టు సమాచారం.

- Advertisement -

Shanmukh Jaswanth: షన్ను హీరోగా సినిమా.. హీరోయిన్ ఎవరంటే? - NTV Telugu

వివేక్ ఆత్రేయ ఇప్పటిదాకా తెలుగులో మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి లాంటి సినిమాలను తెరకెక్కించారు. ప్రస్తుతం నానితో కలిసి సరిపోదా శనివారం అనే మూవీని చిత్రీకరిస్తున్నారు. అలాగే మెంటల్ మదిలో మూవీలో మూడు పాటలకు, ఈ నగరానికి ఏమైంది అనే సినిమాలోని రెండు పాటలకు లిరిక్స్ కూడా అందించాడు. మొత్తానికి స్టార్ డైరెక్టర్ సపోర్ట్ ఉండడంతో ఈ మూవీ కచ్చితంగా హిట్ అవుతుంది అంటున్నారు షణ్ముఖ అభిమానులు.

సోషల్ మీడియాకు దూరం

సోషల్ మీడియాలో ప్రయాణం మొదలు పెట్టి పాపులర్ యూట్యూబర్ గా ఎదిగిన షణ్ముఖ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ సీజన్ 5లో అడుగు పెట్టాడు. అయితే ఈ షోలో రన్నరప్ గా నిలిచాడు. నిజానికి షణ్ముఖ్ విన్నర్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ వీజె సన్నీ గెలిచాడు. ఆ తర్వాత దీప్తి సునయనతో బ్రేకప్, గంజాయి కేసులో అరెస్ట్ అయ్యి సంచలనం సృష్టించాడు. దీంతో తీవ్ర విమర్శలు రాగా, పూర్తిగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. షణ్ముఖ్ తాజాగా తన మూవీకి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు. ప్రస్తుతానికి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు. మరి మూవీ ప్రమోషన్ టైమ్ లో కూడా ఇలాగే ఉంటాడా? అనేది చూడాలి. కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన చాలా కాలం తరువాత షణ్ముఖ్ ఈ వెబ్ మూవీ చేస్తుండడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు