Shanvi Srivastava: కడుపునొప్పితో అల్లాడిపోయిన హీరోయిన్.. డాక్టర్ చెప్పింది వింటే కన్నీరు మున్నీరు..!

Shanvi Srivastava..తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలలో కొన్ని పాత్రలు కొంతమంది చేస్తేనే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అలాంటి పాత్రలలో నటించింది హీరోయిన్ శాన్వీ శ్రీవాస్తవ.. ఈమె యంగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన లవ్లీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.. ఈ సినిమా 2012లో విడుదలయ్యి పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఆ తర్వాత అడపాదడపా సినిమాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.. కన్నడలో కూడా స్టార్ హీరోలతో నటించి అక్కడ బాగానే గుర్తింపు సంపాదించుకుంది. అలాగే మరాఠీలో కూడా ఎన్నో చిత్రాలలో నటించింది శాన్వి శ్రీ వాస్తవ.

Shanvi Srivastava: Heroine who was shaken by stomach pain.. She burst into tears when she heard the doctor's words..!
Shanvi Srivastava: Heroine who was shaken by stomach pain.. She burst into tears when she heard the doctor’s words..!

పుట్టినరోజు తర్వాతే అసలు కష్టం ఎదిరైంది..

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న శాన్వీ .. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు యాక్టివ్ గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శాన్వీ తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనల గురించి తెలియజేసింది.. ముఖ్యంగా గత ఏడాది డిసెంబర్లో తన జీవితంలో జరిగిన కష్టతరమైన విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది.. డిసెంబర్ 8న ఈమె పుట్టినరోజు తర్వాత తన జీవితం తాను చాలా కష్ట సమయం ఎదుర్కొన్నాను అంటూ తెలిపింది. అనుకోకుండా డిసెంబర్ 9న తనకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందని.. దీంతో అసలు కదలలేని పరిస్థితి ఏర్పడిందని.. భయంకరమైన నొప్పి వచ్చింది అంటూ తెలిపింది.

డాక్టర్ క్యాన్సర్ పరీక్ష చేయించాలన్నారు..

దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఈమెను వైద్యుల వద్దకు తీసుకువెళ్లగా వైద్యులు సైతం..MRI, క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలని సూచించారట.. ఒక్కసారిగా క్యాన్సర్ టెస్ట్ అనగానే తన మనసు చాలా చెదిరిపోయింది అని తెలిపింది.. క్యాన్సర్ అంటే తీవ్రమైన నొప్పి.. వరుసగా ఆపరేషన్లు , కీమో థెరపీ వల్ల చాలా భరించలేని బాధ.. అంతే కాకుండా జుట్టు రాలడం ఇలా ఎన్నో సమస్యలు ఒక్కసారిగా తన కళ్ళ ముందుకు వచ్చాయని వెల్లడించింది.. కానీ వైద్య పరీక్షల రిపోర్టు చూసిన తర్వాత వైద్యులు తనకి క్యాన్సర్ లేదని అండాశయాలలో తిత్తులు ఏర్పడ్డాయని చెప్పారట.

- Advertisement -

ఆ తర్వాత ఊపిరి పీల్చుకున్నా..

అయితే ఇది క్యాన్సర్ కాదు కానీ దీర్ఘ కాలిక చికిత్స అవసరమని వైద్యులు తెలియజేసినట్లు ఆమె వెల్లడించింది. ఇక డిసెంబర్ నుంచి పవర్ఫుల్ యాంటీబయోటిక్స్ సైతం తీసుకుంటున్నట్లు తెలియజేసింది. అలాగే కొన్ని రకాల మందుల కారణంగా సైడ్ ఎఫెక్టులు వస్తాయని కూడా వైద్యులు తెలియజేశారట.. దీంతో గత నాలుగు నెలలుగా శ్వాసకు సంబంధించిన వ్యాయామాల పైన ఎక్కువగా ఈమె దృష్టి పెట్టినట్లు తెలియజేసింది.. తన జీవితంలో ఎన్ని సవాళ్లు, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్తానంటూ తెలియజేసింది శాన్వీ.. అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా శాన్వి చేసిన కామెంట్లకు ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆరాటపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు