Sharwanand : ఇకపై శర్వా ఛార్మింగ్ స్టార్..! ఆ టైం లోనే అనుకున్నారా!

Sharwanand : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన “మనమే” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న (జూన్ 5) గ్రాండ్ గా హైదరాబాద్ లో జరిగింది. ఇక ఈ వేడుకకు మారుతీ సహా పలువురు డైరెక్టర్లు గెస్ట్ లుగా హాజరయ్యారు. ఇక మనమే సినిమాను శ్రీ రామ్ ఆదిత్య డైరెక్ట్ చేయగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వివేక్ కూచిబొట్ల, టిజి విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఇది ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ వేడుకలో నటీనటుల స్పీచ్ తో పాటు పలు ఆసక్తికర విషయాలు, విశేషాలు చోటుచేసుకున్నాయి. అలాగే శర్వానంద్ కి సంబంధించి ఒక స్పెషల్ విశేషం ఇక్కడ చోటు చేసుకుంది. యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) కి చిత్ర యూనిట్ ఒక స్పెషల్ ట్యాగ్ ఇచ్చేసారు.

Sharwanand became a Charming Star from now

ఇకపై శర్వా చార్మింగ్ స్టార్..

టాలీవుడ్ హీరో శర్వానంద్ కి మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీ మేకర్స్ స్పెషల్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. అయితే సాధారణంగా స్టార్ హీరోలందరికీ పేరు ముందు ఏదో ఒక ట్యాగ్ ఉంటుంది. ఏదో ఒక స్టార్ పేరుతో అభిమానులు తమ హీరోని పిలుస్తారు. గతంలో స్టార్ హీరోలకు మాత్రమే వేసుకునే ట్యాగ్ ఇప్పుడు ప్రతి హీరోకి పేరు ముందు వేస్తున్నారు. హీరోలు స్వతహాగా ఈ స్టార్ ట్యాగ్స్ పెట్టుకోకపోయినా అభిమానులు లేదా హీరో చుట్టుపక్కల ఉండే వాళ్ళు పెడతారు. తాజాగా హీరో శర్వానంద్ కి మొదటి సారి ఓ స్టార్ ట్యాగ్ ఇచ్చారు. శర్వానంద్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోగా ఎదిగాడు. ఎన్నో ఏళ్ళ నుంచి సినీ పరిశ్రమలో ఉండి మంచి మంచి సినిమాలను అందించాడు. ఇప్పుడు జూన్ 7న మనమే సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్ లో మనమే సినిమా నిర్మాత, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ శర్వానంద్ కి ఒక స్టార్ ట్యాగ్ ఇచ్చారు.
శర్వానంద్ కి “ఛార్మింగ్ స్టార్” అంటూ మేకర్స్ స్పెషల్ ట్యాగ్స్ ఇచ్చారు.

- Advertisement -

అప్పట్లోనే అన్నారట..

ఇక శర్వానంద్ కి ఛార్మింగ్ స్టార్ ట్యాగ్ ఇస్తూ ఆ టైటిల్ లోగో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్క్రీన్ పై ప్లే చేసి చూపించారు. ఇకపై శర్వానంద్ సినిమాల్లో పేరుకు ముందు ఛార్మింగ్ స్టార్ అనే స్టార్ ట్యాగ్ పడనుంది. అయితే దీనిపై శర్వానంద్ స్పందిస్తూ.. గతంలో ‘మహానుభావుడు’ సినిమా టైంలో డైరెక్టర్ మారుతి ఏదో ఒక ట్యాగ్ పెట్టుకో అని చాలా పేర్లు వినిపించారట. తాను వద్దన్నానని శర్వా అన్నాడు. మీరు ఇప్పుడు ఇలా సర్ ప్రైజ్ ఇచ్చారు. థ్యాంక్యూ సర్ అని అన్నారు. దీంతో శర్వా ఫ్యాన్స్ తమ హీరోని ఇకపై ఛార్మింగ్ స్టార్ అని పిలుచుకోబోతున్నారు. ఇక మనమే సినిమా రేపు జూన్ 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు