Sharwanand: మనమే సినిమాలో గే పాత్రలో కనిపించనున్న యంగ్ హీరో

ముందుగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు శర్వానంద్. అయితే ఎట్టకేలకు శర్వానంద్ హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. శర్వానంద్ కెరియర్లో చెప్పుకోదగ్గ సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. శర్వానంద్ కేవలం కమర్షియల్ సినిమాలు చేయడమే కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ఎంచుకోవడంలో కూడా ముందుంటాడని చెప్పొచ్చు. అలా శర్వా కెరియర్ లో వచ్చిన సినిమాలే గమ్యం, ప్రస్థానం, మళ్లీమళ్లీ ఇది రాని రోజు.

ఇకపోతే ఆ మధ్య కాలంలో శర్వానంద్ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. తను లాస్ట్ గా చేసిన ఒకే ఒక జీవితం సినిమా మంచి హిట్ అయింది. ఆ సినిమాలో మదర్ సెంటిమెంట్ తో పాటు టైం ట్రావెల్ ని కూడా చూపించిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం శర్వానంద్ వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇప్పుడు శర్వానంద్ నుంచి రాబోయే తదుపరి చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు.

మనమే అనౌన్స్‌మెంట్…
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ చేస్తున్న సినిమాకి మనమే అనే టైటిల్ ను ఖరారు చేశారు. నేడు శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఆ టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా గురించి చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాకి హృదయం ఫేమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్ గా హాయ్ నాన్న సినిమాకి అద్భుతమైన సంగీతం అందించాడు అబ్దుల్. మళ్లీ ఈ సినిమాకి కూడా అబ్దుల్ సంగీతం అందించడం వలన ఈ సినిమా పైన క్యూరియాసిటీ పెంచుతుంది.

- Advertisement -

గే పాత్రలో ఎవరంటే…
ఇకపోతేఈ సినిమాలో ఒక యంగ్ హీరో గే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. తను మరెవరో కాదు “చూసి చూడంగానే” అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన శివ కందుకూరి. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శివ కందుకూరి మంచి సినిమాలు చేస్తూ తన కెరియర్ ను పక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

రీసెంట్ గా బూతద్దం భాస్కర్ నారాయణ సినిమాతో థియేటర్ వద్దకు వచ్చిన శివ కందుకూరి, ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కూడా మంచి టాక్ తో నడుస్తుంది. ఇకపోతే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ చేస్తున్న సినిమాలో శివ కందుకూరి గే పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో ఈ పాత్రకి ఎక్కువ స్కోప్ ఉందని కూడా తెలుస్తుంది.

ఇకపోతే హీరోగా కొన్ని మంచి సినిమాలు ఎంచుకుంటూ కొన్ని పాత్రలు చేస్తున్న ఒక యంగ్ హీరో. మరో హీరో సినిమాలో ఒక గే పాత్రను ప్లే చేస్తున్నాడు అంటే ఆ పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఒక యంగ్ హీరో అలాంటి పాత్రను చేయడమనేది కూడా గొప్ప విషయమై చెప్పవచ్చు. ఏదేమైనా సినిమా రిలీజ్ అయితే గాని ఆ సినిమాలో ఆ పాత్రకి ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది ఒక క్లారిటీ రాదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు