Sharwanand : ఒక ఇంటి వాడు అయ్యాడు

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ లిస్ట్ లో ఉన్న శర్వానంద్, ఎప్పుడు పెళ్లి మాట వచ్చినా ప్రభాస్ తర్వాత అని దాటేస్తూ ఉంటాడు. ఇక తాజా గా ఈ హీరో ఆ లిస్ట్ నుంచి పక్కకు వచ్చేసాడు.

ఈ స్టార్ యాక్టర్ పొలిటిషియాన్ బొజ్జల గోపాల కృష్ణ రెడ్డి మనవరాలు, హై కోర్ట్ లాయర్ మధు సుధ రెడ్డి కుమార్తె అయిన రక్షిత రెడ్డి తో ఈరోజు [26-01-2023] న నిశ్చితార్ధం చేసుకున్నారు. పెళ్లి ముహూర్తం ఇరు కుటుంబాలు ఇంకా ప్రకటించలేదు.

ఈరోజు జరిగిన ఈ నిశ్చితార్థంలో శర్వానంద్, రక్షిత పోస్ ఇస్తూ ఫోటోలను అప్లోడ్ చేసారు. రామ్ చరణ్, శర్వానంద్ చాల కాలంగా మంచి స్నేహితులు కావటం తో రామ్ చరణ్ ఉపాసన కూడా నిశ్చితార్ధానికి హాజరు అయ్యారు. వాళ్ళతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

ఇక శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంకా ఎంటర్టైనింగ్ సినిమాలు, కమర్షియల్ హిట్స్ చేసేందుకు చాల కష్టపడుతున్నాడు. ఈ ఏడాది లో శర్వా ఇంకో రెండు సినిమాలు చేయనున్నారు. ఈ విషయంపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు