Manamey : ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘మనమే’ కి ప్లస్ పాయింట్ అదే!

Manamey : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన “మనమే” సినిమా ఫైనల్ గా జూన్ 7న రిలీజ్ కాబోతుంది. విభిన్న కథలతో ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేసే దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాని తెరకెక్కించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో వివేక్ కూచిబొట్ల, టిజి విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఇక ఈ చిత్రంలో శర్వానంద్, కృతి శెట్టి హీరో హీరోయిన్స్‌గా నటించారు. ఇక మనమే సినిమాతో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథాంశం చెప్పే ప్రయత్నం దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చేస్తున్నారు. మూవీ టీజర్, ట్రైలర్ కి ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరామ్ ఆదిత్య మనమే కథ గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఈ కథ మన మధ్యలో మన జీవితాలలో జరిగేది అని చెప్పారు. ఈ సినిమాలో చాలా సీన్లు కూడా నా జీవితంలో రెగ్యులర్‌గా ఉపయోగించేవి ఉంటాయని అన్నారు. ఇక సమ్మర్ ముగిసాక రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు కొన్ని విషయాల్లో ఈ రిలీజ్ కలిసొస్తుందని చెప్పాలి.

Sharwanand Maname movie is releasing as a family entertainer

- Advertisement -

ఈ పరిస్థితుల్లో మనమే కి ప్లస్ పాయింట్..

ఇక మనమే (Manamey) సినిమా సమ్మర్ సీజన్, ఐపీఎల్ సీజన్ పూర్తి అయ్యాకా.. అన్నిటికి మించి ఎన్నికల హడావిడి ముగిసాక వస్తుంది కాబట్టి ఈ సినిమాకు కలిసొచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రెండు నెలలుగా సరైన సినిమాల్లేక ప్రేక్షకులు ఆకలిమీదున్నారు. పైగా ఐపీఎల్, ఎన్నికల హడావుడితో విసిగిపోయారు. ఇప్పుడు ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ ని భర్తీ చేసే ఛాన్స్ మనమే సినిమాకు వచ్చింది. ఇక మనమే సినిమా క్లీన్ ఫ్యామిలీసి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఒక అటాచ్మెంట్, భావోద్వేగాలు ప్రతి కుటుంబంలో ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా చూసే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల మనమే సినిమాకి ఈ టైం లో రిలీజ్ అవడం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.

ఫ్యామిలీ ఆడియన్సే టార్గెట్..

ఇక గత కొంత కాలంగా ఎన్నికలతో, ఎండలతో విసిగిపోయిన ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంటెర్టైన్మెంట్ కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనమే సినిమా మంచి ఆప్షన్ గా మారనుంది. ఇక ఈ మూవీలో శర్వానంద్, కృతి శెట్టి రోల్స్ టామ్ అండ్ జెర్రీ తరహాలో ఉంటాయని మేకర్స్ పేర్కొన్నారు. ఇక శర్వానంద్ ఒకే ఒక్క జీవితం మూవీతో రెండేళ్ల క్రితం సూపర్ హిట్ కొట్టారు. ఆ కథ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కినదే కావడం విశేషం. అయితే ఈ సారి ఒక చిన్న పిల్లాడి చుట్టూ ఎంటర్టైన్మెంట్ జోడించి చెప్పే ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకులని మెప్పించడానికి రెడీ అవుతున్నారు. ఇక సెన్సార్ నుండి యూఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా జూన్ 7న ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు