Sharwanand: ఈ ఫంక్షన్ పిఠాపురంలో చేద్దాం అనుకున్నాం, పర్మిషన్ దొరకలేదు..

Sharwanand: పిఠాపురం ఇది కేవలం గోదావరి ప్రజలకు మాత్రమే కాదు ఇప్పుడు దేశం అందరికీ తెలుసు. దీని కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిజాస్టర్ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ పెట్టగల స్టామినా ఆయనది. పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయంగా కూడా అడుగులు వేశారు. అయితే దాదాపు పదివేల నిరీక్షణ తర్వాత రాజకీయంలో కూడా ఒక గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హీట్ కొట్టారని చెప్పొచ్చు. పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ భారీ మెజారిటీతో గెలిచారు.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీని టార్గెట్ చేశారు

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు ఆ తరువాత మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత చేసిన భీమ్లా నాయక్, బ్రో సినిమాలు కూడా పరవాలేదు అనిపించుకున్నాయి. అయితే పవన్ అప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండటం వలన ఈ సినిమాలు ఏవి కమర్షియల్ గా హిట్ కాలేదు. పవన్ కళ్యాణ్ ని అప్పుడు టార్గెట్ చేయడం కూడా మొదలుపెట్టారు. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా టార్గెట్ చేశారు.

Pawan Kalyan

- Advertisement -

గ్రేట్ కం బ్యాక్

అప్పట్లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయారు. కానీ ఇప్పుడు 21 సీట్లలో తన పార్టీ పోటీ పోటీ చేస్తే 21 సీట్స్ లో కూడా తమ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఇకపోతే పిఠాపురం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. పిఠాపురం అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. అయితే ఆ పిఠాపురంలో శర్వానంద్ నటించిన మనమే అనే ఫంక్షన్ చేద్దామని అనుకున్నారట. కానీ పర్మిషన్స్ దొరకలేదని చెప్పుకొచ్చాడు. కానీ సక్సెస్ మీట్ మాత్రం అక్కడే చేస్తామంటూ చెప్పుకొచ్చాడు శర్వానంద్.

శర్వానంద్ మెగా ఫ్యామిలీ రిలేషన్

శర్వానంద్ కి మెగా ఫ్యామిలీకి ఎంతటి రిలేషన్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ తేజ్ శర్వానంద్ కి మంచి స్నేహితుడు. మెగాస్టార్ చిరంజీవి కూడా శర్వానంద్ కి మంచి సపోర్ట్ చేస్తారు. ఇదివరకే చాలా సినిమాలకి విషెస్ కూడా తెలియజేశారు. ఇప్పటివరకు ఇండస్ట్రీ ఎదుర్కొన్న అన్ని సమస్యలను కొంత మేరకు క్లియర్ అవుతాయని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా జూన్ 7న ప్రేక్షకులు ముందుకు రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు