Shatamanam Bhavati : “శతమానం భవతి” సీక్వెల్ అనౌన్స్ చేసిన దిల్ రాజు… వచ్చే సంక్రాంతిపై కర్చీఫ్ వేసిన ప్రొడ్యూసర్

Shatamanam Bhavati :  కుటుంబ కథా చిత్రం “శతమానం భవతి”కి సీక్వెల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ సీక్వెల్ టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. మరి ఈ సీక్వెల్ టైటిల్ ఏంటి? డైరెక్టర్ ఎవరు? ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతోంది? అనే వివరాల్లోకి వెళితే…

“శతమానం భవతి” మూవీ 2017లో విడుదలై మంచి ప్రేక్షకాదరణతో పాటు నేషనల్ అవార్డును కూడా దక్కించుకుంది. “శతమానం భవతి” మూవీలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించగా, జయసుధ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించారు. కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించారు. 2017 సంక్రాంతి కానుకగా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా అప్పట్లో నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది.

15 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ 40 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అదే సమయంలో చిరంజీవి “ఖైదీ నెంబర్ 150”, బాలకృష్ణ “గౌతమీపుత్ర శాతకర్ణి” వంటి పెద్ద సినిమాలు విడుదలైనప్పటికీ “శతమానం భవతి” ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. ఈ మూవీ వచ్చి ఏడేళ్లు గడిచిపోయిన తర్వాత తాజాగా సీక్వెల్ ను ప్రకటించి, మూవీ లవర్స్ కు సంక్రాంతి ట్రీట్ ఇచ్చేశారు దిల్ రాజు.

- Advertisement -

“శతమానం భవతి”కి సీక్వెల్ గా రాబోతున్న మూవీ టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను సంక్రాంతి సందర్భంగా సోమవారం రివీల్ చేశారు. ఈ మూవీకి “శతమానం భవతి నెక్స్ట్ పేజీ” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మూవీని 2025 సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ సీక్వెల్ కు దిల్ రాజే నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. అయితే డైరెక్టర్ విషయంలోనే ఇంకా క్లారిటీ లేదు. “శతమానం భవతి నెక్స్ట్ పేజీ” మూవీతో కొత్త డైరెక్టర్ ను పరిచయం చేయబోతున్నారనే టాక్ ఫిలింనగర్ లో నడుస్తోంది.

Shatamanam Bhavati : Dil Raju Announces "Shatamanam Bhavati" Sequel...

“శతమానం భవతి” మూవీకి రైటర్ గా పని చేసిన హరి ఈ సీక్వెల్ కు కథను అందిస్తున్నారని సమాచారం. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను ఆయనే తీసుకుంటారా? లేదంటే మరో డైరెక్టర్ చేతికి ఈ సీక్వెల్ ను నిర్మాత దిల్ రాజు అప్పగిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. కాగా “శతమానం భవతి నెక్స్ట్ పేజీ” మూవీలో నటించబోయే హీరో హీరోయిన్లు, నటీనటుల గురించిన వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి ఏడాది ముందు నుంచే రిలీజ్ డేట్ ను ప్రకటించేశారు దిల్ రాజు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు