Shathamanam Bhavathi Next Page: సీక్వెల్‌ని ఏ మాత్రం ఇమేజ్ లేని హీరో నిలపెట్టగలడా..?

కొన్నిసార్లు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు గా రికార్డును సృష్టిస్తాయి. ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ సాధించి మంచి కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు రేర్ గా వస్తాయి. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమాలు కూడా ఒక్కోసారి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడతాయి. ఇకపోతే సంక్రాంతి సీజన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి సీజన్ వస్తుంది అని అంటే ఖచ్చితంగా దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక సినిమా వస్తుంది.

దిల్ రాజు ప్రొడక్షన్స్ లో మాక్సిమం పెద్ద సినిమాలను దించే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఒక సంవత్సరం మాత్రం పెద్ద హీరోలతో పాటు తన ప్రొడక్షన్స్ నుంచి ఒక చిన్న సినిమాను వదిలాడు దిల్ రాజు. ఆ చిన్న సినిమాతోనే అద్భుతమైన కలెక్షన్స్ సాధించి సక్సెస్ అయ్యాడు. ఆ చిన్న సినిమా పేరు శతమానం భవతి. మెగాస్టార్ రీ ఎంట్రీ ఫిలిం “ఖైదీ నెంబర్ 150” అలానే నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఒక ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి బరిలో తలపడ్డాయి. ఆ ఆ రెండింటితో పాటుగా శతమానం భవతి సినిమాను రిలీజ్ చేశాడు దిల్ రాజు.

అయితే శతమానం భవతి సినిమా ఊహించని రీతిలో మంచి హిట్ అయింది. థియేటర్స్ లో హౌస్ ఫుల్ గా రన్ కొనసాగింది. ఇప్పటికి శర్వానంద్ కెరియర్ లో బెస్ట్ ఫిల్మ్ అంటే శతమానం భవతి అని చెప్పొచ్చు. కుటుంబ వ్యాల్యూస్ ని, ఊరి యొక్క గొప్పతనాన్ని, మూలాలని గుర్తు చేసిన సినిమా శతమానం భవతి. శతమానం భవతి సినిమాకు ఉన్న స్టేటస్ ఇప్పటికి తగ్గదు.

- Advertisement -

అయితే శతమానం భవతి సినిమాకి సీక్వెల్ గా శతమానం భవతి నెక్స్ట్ పేజ్ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. బేసిక్ గా ఒక సినిమా సీక్వెల్ అంటే ముందు నటించిన హీరోయే దానిలో కనిపిస్తాడు. కానీ ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్ గా జరగబోతుంది. శతమానం భవతి నెక్స్ట్ పేజ్ సినిమాలో ఆశిష్ రెడ్డి హీరోగా కనిపించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. దీని కారణం శర్వానంద్ యొక్క డేట్స్ కుదరకపోవడమే అంటూ తెలుస్తుంది.

ఆశిష్ రెడ్డి కెరీర్ ఇలా…
ఇకపోతే రౌడీ బాయ్స్ అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్ రెడ్డి. అయితే ఆ సినిమా ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత సుకుమార్ శిష్యుడైన కాశీ తో సెల్ఫీస్ అనే సినిమాను చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఆ ప్రాజెక్టు గురించి కూడా ఇప్పటికీ మరో అప్డేట్ అంటూ లేదు. అలానే రీసెంట్ గా “లవ్ మీ” అనే ఒక సినిమాను కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఆర్య కైండ్ ఆఫ్ ఫిల్మ్ లా ఉండబోతుందని దిల్ రాజు తన మాటల్లో చెప్పుకొచ్చారు.

ఇంతకీ హీరో ఎవరు…?
ఇకపోతే శతమానం భవతి నెక్స్ట్ పేజ్ సినిమాలో ఆశిష్ రెడ్డి హీరోగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే శతమానం భవతి సినిమాకు ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతటి ఘనవిజయాన్ని సాధించిన ఆ సినిమా. సీక్వెల్లో ఆశిష్ రెడ్డి నటించడం అనేది చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆశిష్ రెడ్డి కి టాలెంట్ ఉన్నా కూడా ప్రస్తుతానికైతే ఇంకా ప్రూవ్ చేసుకోలేదు. ఇంకా టాలెంట్ ప్రూవ్ చేసుకొని ఆశిష్ లాంటి హీరోతో శతమానం భవతి నెక్స్ట్ పేజ్ తెరకెక్కించడం అనేది ఆశ్చర్యంగా మారింది. ఏదేమైనా కొన్నేళ్లు లేట్ అయినా కూడా మళ్లీ శర్వాతో ఆ సినిమాను చేయటం కరెక్ట్ అనేది చాలామంది అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు