Shekhar master: దేవర సాంగ్ అప్డేట్.. శేఖర్ మాస్టర్ క్లారిటీ..!

Shekhar master.. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు బుల్లితెర షోలలో జడ్జిగా వ్యవహరిస్తూనే మరొకవైపు స్టార్ హీరోల సినిమాలలోని పాటలకు కొరియోగ్రఫీ అందిస్తూ భారీ క్రేజ్ దక్కించుకున్నారు. చిరంజీవిని మొదలుకొని ఎన్టీఆర్ వరకు చాలామంది స్టార్ హీరోల సినిమాలకు పనిచేశారు శేఖర్ మాస్టర్. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈయన ఎన్టీఆర్ దేవర సినిమాకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేవర సినిమా నుంచి వస్తున్న పాటకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. శేఖర్ మాస్టర్ ఇచ్చిన అప్డేట్ కి అభిమానులలో గూస్ బంప్స్ మొదలయ్యాయి…

Shekhar master: Devara song update.. Shekhar master Clarity..!
Shekhar master: Devara song update.. Shekhar master Clarity..!

సెప్టెంబర్ 27న దేవర రిలీజ్…

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన చాలా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు చిత్ర బృందం. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు తొలిసారి ఈ సినిమాతో టాలీవుడ్ స్క్రీన్ పంచుకోబోతోంది ఈ ముద్దుగుమ్మ. దీంతో అటు నార్త్ ఇటు సౌత్ ఆడియన్స్ లో కూడా ఆసక్తి నెలకొంది. త్వరలో ఈ సినిమా నుంచి పాట రాబోతున్న నేపథ్యంలో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు శేఖర్ మాస్టర్.

దేవర సాంగ్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన శేఖర్ మాస్టర్..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. దేవర మూవీ లో కంపోజ్ చేయబోయే పాట ఎలా ఉంటుందో చూసి చెప్పాలి. మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. డాన్స్ కి కచ్చితంగా ప్రాధాన్యం ఉన్న పాట ఇది. రెండు రోజుల్లో షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది అంటూ తెలిపారు. ఇకపోతే ఈ పాట డాన్స్ లవర్స్ కి బాగా నచ్చుతుందని, కచ్చితంగా వైరల్ అవుతుందని తన అభిప్రాయంగా శేఖర్ మాస్టర్ తెలిపాడు. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

శేఖర్ మాస్టర్ సినిమాలు..

శేఖర్ మాస్టర్ ప్రస్తుతం దేవర సినిమాతో పాటు బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోని పాటకి అలాగే విజయ్ హీరోగా రూపొందుతున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమాలోని పాటకి కూడా కొరియోగ్రఫీ చేశానని తాజాగా చెప్పుకొచ్చారు.

ఈ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..

ఇకపోతే ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాలలోని లవ్ మీ అగైన్, దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, బంతిపూల జానకి వంటి హిట్ పాటలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో పాట రాబోతోంది అని తెలియడంతో అటు అభిమానులలోనే కాదు ఇటు ఆడియన్స్ లో కూడా ఆసక్తి నెలకొంది. మరి ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న పాట ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు