Shilpa Shetty: స్టార్ హీరో చేతిలో మోసపోయిన శిల్పా శెట్టి.. ఎవరంటే..?

Shilpa Shetty: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి తన అందచందాలతో అటు బాలీవుడ్ ప్రేక్షకులను ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరించిన విషయం తెలిసిందే.. వెంకటేష్ నటించిన సాహస వీరుడు సాగర కన్య సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈమె వయసు 49.. అయినా సరే ఇప్పటికీ తరగని అందంతో.. చక్కటి ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ చూపరులను ఆకట్టుకుంటూ.. మరింత యంగ్ గా మారిపోయింది శిల్పా శెట్టి.. ప్రస్తుతం బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ ఉంటుంది.. ఇక నిత్యం తాను వర్కౌట్స్ చేసే వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది.. ఇదిలా ఉండగా తాజాగా శిల్పా శెట్టి కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

అక్షయ్ కుమార్ తో ఎఫైర్..

Shilpa Shetty: Who is Shilpa Shetty who was cheated by the star hero..?
Shilpa Shetty: Who is Shilpa Shetty who was cheated by the star hero..?

అదేమిటంటే ఒక స్టార్ హీరో చేతిలో శిల్పా శెట్టి మోసపోయింది అంటూ ఒక వార్త సోషల్ మాధ్యమాలలో మరింత హాట్ టాపిక్ గా మారింది. నిజానికి గతంలో హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో ఈమె ప్రేమలో ఉందనే ప్రచారం జోరుగా సాగింది. వీరిద్దరూ కలిసి మై ఖిలాడీ తూ అనారి సినిమాలో జంటగా నటించారు. 1994లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారి కొన్నేళ్లపాటు రిలేషన్షిప్ లో కూడా ఉన్నారట. కానీ 2000 వ సంవత్సరంలో మనస్పర్ధలు రావడంతో విడిపోయారని సమాచారం. ఇకపోతే 2001లో అక్షయ్ కుమార్ నటి ట్వింకిల్ ఖన్నాను వివాహం చేసుకున్నారు.. ఇక ఈ విషయం తెలుసుకున్న శిల్పా శెట్టి జీర్ణించుకోలేకపోయింది.. ఇక చివరికి అతడి చేతిలో మోసపోయానని తెలుసుకొని.. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు పాటు ఒంటరిగా ఉన్న ఈమె రాజ్ కుంద్రా ను వివాహం చేసుకుంది.

ఆమె మాయలో పడి శిల్పా శెట్టి కి అన్యాయం చేసిన అక్షయ్ కుమార్..

ఇదిలా ఉండగా ఈ విషయాలను స్వయంగా శిల్పా శెట్టి బిగ్ బ్రదర్ షోలో పాల్గొన్నప్పుడు వెల్లడించింది.. అలాగే తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా పంచుకుంది.. శిల్పా శెట్టి షోలో మాట్లాడుతూ.. అక్షయ్ కుమార్ నన్ను లవ్ చేస్తున్నానని చెబుతూనే.. ట్వింకిల్ ఖన్నాతో ప్రేమాయణం నడిపించాడు.. ఆ తర్వాత నన్ను వాడుకొని వదిలేసాడు.. ట్వింకిల్ ఖన్నా కోసమే నన్ను వదిలేసాడని.. ప్రేమ పేరుతో నన్ను మోసం చేశాడని.. ఆ తర్వాత నాకు అర్థం అయింది అంటూ సంచలన ఆరోపణలు చేసింది శిల్పా శెట్టి.. ఇక ప్రస్తుతం శిల్పా శెట్టి చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి..

- Advertisement -

రాజ్ కుంద్రా తో పెళ్ళి..

రాజ్ కుంద్రా ను వివాహం చేసుకోగా ఈ జంటకు ఒక పాప , ఒక బాబు కూడా ఉన్నారు. ఇక రెండేళ్ల క్రితం ఈమె భర్త రాజ్ కుంద్రా కూడా అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇలా ఎన్నో సమస్యలను దిగమింగుకొని ఇప్పటికి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది శిల్పా శెట్టి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు