Shine Tom: ఆన్ స్క్రీన్ విలన్- ఆఫ్ స్క్రీన్ కమెడియన్ -వైరల్ గా మారిన దసరా విలన్ చేష్టలు

దసరా సినిమాలో చిన్న నంబి పాత్రలో నటించిన మలయాళం యాక్టర్ షైన్ టామ్ చాకో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఆన్ స్క్రీన్ లో అందరిని భయపెట్టే ఈ నటుడు ఆఫ్ స్క్రీన్ ఆటిట్యూడ్ మాత్రం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈయన వింత వింత చేష్టలకు తెలుగు ప్రేక్షకులు పగలబడి నవ్వుతున్నారు.

అయితే దసరా సినిమా తరువాత వరుస తెలుగు సినిమాలతో బిజీ అయిన షైన్ టామ్, లేటెస్ట్ గా నాగ శౌర్య హీరోగా వస్తోన్న రంగబలి సినిమాతో మరోసారి తెలుగు ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. పవన్ భాసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 7న రిలీజ్ అవ్వబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు మూవీ యూనిట్. దసరా సినిమాతో ప్రేక్షకులలో నటుడిగా షైన్ టామ్ కు మంచి గుర్తింపు రావడంతో ఈయన చేత కూడా సినిమాని ప్రమోట్ చేయిస్తున్నారు.

ఇటీవలనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన యాంకర్ మీ షర్ట్ బాగుందని చెప్పడంతో వెంటనే షర్ట్ తీసి ఇవ్వబోయాడు. దాంతో ఒక్కసారిగా అంత షాక్ అయ్యారు. ఈయనేంటి ఇలా ప్రవర్తిసున్నాడని ఒక్క క్షణం ఎవరికీ అర్థంకాక తెల్లమొహం వేశారు. దాంతో ఈ వీడియో నెట్ లో వైరల్ అయింది, ఇక అసలు ఈయన గతంలో ఎలా ఉండేవాడని ఆరా తీయడం స్టార్ట్ చేసారు నెటిజన్లు. కాగా ఈ తవ్వకాల్లో షైన్ టామ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పడ్డాయి, గతంలో కూడా ఈయన నటించిన మలయాళం సినిమా ప్రమోషన్స్ లో ఇదే విధంగా వింత వింతగా ప్రపర్తించగా ఆ వీడియోస్ అన్ని బయటకు తీసి, వాటిని వైరల్ చేస్తున్నారు మిమర్స్. అయితే ప్రస్తుతం ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దాంతో కొంత మంది ఈయనకి కొంచెం తిక్క ఉంది అని అనుకుంటుండగా మరికొంత ఈయన చేష్టలు నవ్వుతూ అందరికి షేర్ చేస్తున్నారు. ఏది ఏమైనా షైన్ టామ్ ఆన్ స్క్రీన్ విలన్ గా ప్రేక్షకులని అలరిస్తూ, ఆఫ్ స్క్రీన్ లో కమెడియన్ గా ఎంటర్టైన్ చేస్తున్నాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు