KurmaNayaki : బిగ్ బాస్ తర్వాత ఫుల్ బిజీగా శివాజీ.. వైవిధ్యమైన పాత్రలో శివన్న..

KurmaNayaki : టాలీవుడ్ హీరో శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు దశాబ్దాల పాటు హీరోగా పలు చిత్రాలతో అలరించిన శివాజీ కొన్నేళ్లుగా సినిమాలకు దూరమై రాజకీయాల్లో బిజీ అయిన విషయం తెలిసిందే. అయితే అక్కడ వర్కౌట్ అవకపోవడంతో తిరిగి సినిమా ఇండస్ట్రీకి వచ్చేసాడు. కానీ అంతగా అవకాశాలు రాలేదు. ఇలాంటి టైం లోనే లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ 7 రియాల్టీ షోలో భాగమయ్యే అవకాశం వచ్చింది. ఆ షోకి వెళ్లి తన ఆటతీరుతో ఆడియన్స్ ని మెప్పించడమే కాకుండా సీజనాలో టాప్ 3 గా నిలిచాడు. అంతే కాదు బిగ్ బాస్ ద్వారా శివాజీ 2.0 గా సరికొత్తగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించాడు. ఇక ఆ ఊపుతో తిరిగి సినిమాల్లో బిజీ అవబోతున్నాడు శివాజీ. ఇప్పటికే 90స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులని మెప్పించాడు శివాజీ. అందులో ఒక సగటు మిడిల్ క్లాస్ తండ్రిగా శివాజీ అద్భుతంగా నటించి ప్రశంసలు దక్కనుంచుకోగా, త్వరలో ఓ వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.

Shivaji in a different role in the movie KurmaNayaki

వైవిధ్యమైన పాత్రలో శివన్న..

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మరో సోషియో ఫాంటసీ మూవీ “కూర్మనాయకి” (KurmaNayaki). వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో ఈ సినిమాలో నటిస్తుందన్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని ఎంఎం క్రియేషన్స్, కాలభైరవ ప్రొడక్షన్స్‌ – రోషన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా, కె విజితా రావ్ నిర్మాతగా, స్నిగ్ధ మణికాంత్ రెడ్డి, పూజ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటివరకూ రాని సరికొత్త కథాంశంతో కూర్మనాయకి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట దర్శకుడు హర్షవర్థన్ కడియాల. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ తో పాటు సాయి కుమార్, అతిరారాజ్, వీటీవీ గణేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండగా, ఇప్పుడు నటుడు శివాజీ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు. తాజాగా జూన్ 30న శివాజీ బర్త్ డే సందర్బంగా కూర్మనాయకి నుండి శివాజీ పాత్రకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేసారు. శివాజీ ఈ చిత్రంలో శివన్నగా ఓ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లుగా ఈ వీడియో చూస్తుంటే తెలుస్తోంది. మహావిష్ణు అవతారాల్లోని కూర్మావతారం నేపథ్యంలో భారీ పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు హర్షవర్థన్ కడియాల.

- Advertisement -

ఫుల్ బిజీ అయిపోయిన శివాజీ…

ఇక శివాజీ హీరోగా బిజీ కాకపోయినా, నటుడుగా బిజీ అవుతున్నాడు. బిగ్ బాస్ ఇచ్చిన కొత్త లైఫ్ తో 90స్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ లో నటించి మెప్పించగా, ఇప్పుడు కూర్మనాయకి తో అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఇక కూర్మనాయకి సినిమా ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తిచేసుకోగా, త్వరలోనే ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా ప్రత్యేక అతిథి పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఇక తాజాగా రిలీజ్ అయిన టీజర్ ద్వారా శివాజీకి మాత్రం మంచి పాత్ర దక్కిందని తెలుస్తుంది. ప్రస్తుతం చిన్న సినిమాల్లో బిజీ అయిన శివాజీ, త్వరలోనే పెద్ద సినిమాల్లో కూడా బిజీ కానున్నట్టు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు