Shobhan Babu: రిజర్వ్డ్ గా వుండే శోభన్ బాబుకు ఆయనంటే ఇష్టమట..ఎందుకంటే..?

Shobhan Babu.. ఆంధ్ర సోగ్గాడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన శోభన్ బాబు ఆంధ్ర ప్రజలలోనే కాదు అటు తమిళ్ ప్రజలలో కూడా ఎనలేని అభిమానం కూడా సంపాదించుకున్నారు.. ఒకవైపు సినిమాలలో హీరోగా నటిస్తూనే.. మరొకవైపు అలా సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెడుతూ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో భారీగా సంపాదించారు. కొన్ని రూ.వేల కోట్లకు అధిపతి కూడా అయ్యారు..

ఆర్థిక నిపుణుడు:

Shobhan Babu: Reserved Shobhan Babu likes him..because..?
Shobhan Babu: Reserved Shobhan Babu likes him..because..?

ఇకపోతే శోభన్ బాబు చాలా రిజర్వ్డ్ గా ఉండేవారు.. ఆయన ఎవరితోనూ పెద్దగా కలిసేవారు కాదు.. ఇక ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ వంటి దిగ్గజ నటులతో కూడా అంటీ అంటున్నట్టు వ్యవహరించేవారు.. అందుకే శోభన్ బాబు అంటే చాలామంది ఒకింత అసహనం వ్యక్తం చేసేవారు.. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో అందరినీ దూరం పెట్టిన శోభన్ బాబు.. ఒక నటుడిని మాత్రం చాలా అమితంగా అభిమానించే వారట.. నిజానికి శోభన్ బాబు చాలా క్రమశిక్షణకు మారుపేరనే చెప్పాలి.. తాను సంపాదించిన ప్రతి రూపాయిని కూడా పెట్టుబడిగా ఎలా మలచాలో తెలిసిన ఆర్థిక నిపుణుడు ఆయన సలహా పాటించి.. కోట్లు సంపాదించిన వారు కూడా చాలామంది ఉన్నారు.. అలాంటివారిలో మురళీమోహన్ పేరు ప్రథమంగా వినిపిస్తుంది. ఒక స్టార్ గా దశాబ్దాల పాటు సినిమాలు చేసిన ఈయన తన కుటుంబాన్ని మాత్రం చిత్ర పరిశ్రమకు తీసుకురాలేదు.. అందుకు కారణం కూడా లేకపోలేదు..

క్యారెక్టర్ రోల్స్ అసలు చేయను:

ఇక పరిశ్రమ స్థిరత్వం లేనిది ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు కాబట్టి తన కుమారుడిని సక్సెస్ఫుల్ బిజినెస్ మాన్ గా తయారు చేశారు శోభన్ బాబు.. ముక్కుసూటితనం ఇతర స్టార్ లతో మంచి సంభంధాలు కొనసాగించకపోవడం వల్లే ఆయన ఇబ్బందులకు గురయ్యారు.. వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డారు.. ఒకానొక సమయంలో పరిశ్రమ ఆయనను పక్కన పెట్టేసింది.. కానీ అంతే వేగంగా పుంజుకొని ట్రాక్ ఎక్కారు.. అలా 90 ల వరకు హీరోగా ఆయన నటిస్తూనే వున్నారు. ఇక స్టార్ డం అయిపోయిందని తెలిసిన తర్వాత సినిమాలు చేయడం మానేశారు.. అంతేకాదు ఈ తరం స్టార్ హీరోల చిత్రాలలో కీలకమైన పాత్రలు ఎన్నో ఆయనను తలుపు తట్టాయి. హీరోగా రిటైర్ అయిన నేను ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ హీరో గానే ఉంటాను.. క్యారెక్టర్ రోల్స్ అసలు చేయను అంటూ ఇండస్ట్రీకి శాశ్వతంగా దూరమయ్యారు.

- Advertisement -

శోభన్ కి ప్రత్యేక అభిమానం:

తర్వాత తాను సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్ లో పెట్టి ఆ డబ్బును రెట్టింపు చేసుకున్నారు. ఇక ఇంత రిజర్వ్డ్ గా ఉండే శోభన్ బాబు పరిశ్రమలో ఒక నటుడిని మాత్రం చాలా ఇష్టపడే వారట. ఆయన ఎవరో కాదు గుమ్మడి వెంకటేశ్వరరావు. ఆయనంటే శోభన్ కి ప్రత్యేక అభిమానం.. ఈ విషయాన్ని గుమ్మడి కూతురు శారద ఒక సందర్భంలో తెలిపింది. శోభన్ బాబు ఎవరింటికి వచ్చేవారు కాదు.. అయితే ఒకసారి మద్రాస్ లో నాన్న గుమ్మడి బర్తడే వేడుకలు నిర్వహించగా ఆయన వేడుకల్లో పాల్గొన్నారు.. రోజంతా నాన్నతోనే ఉన్నారు. తర్వాత నా చిన్న చెల్లెలు.. పెళ్లి వేడుకల్లో కూడా శోభన్ బాబుని ఆహ్వానిస్తే.. ఆయన అవుట్ డోర్ షూటింగ్లో ఉండడం వల్ల ఆయన భార్య పెళ్లికి వచ్చింది.. నాన్న అంటే ఆయనకు అంత అభిమానం అంటూ శారద వెల్లడించారు. ఇకపోతే గుమ్మడి కంటే వయసులో శోభన్ బాబు చిన్నవారు అన్న విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు