Shobhitha Dulipala : నాగ చైతన్య కంటే ముందే శోభితకు పెళ్ళైందా? ఇది అస్సలు ఊహించలేదు మామా..

Shobhitha Dulipala : నాగ చైతన్య ( Naga Chaithanya) కంటే ముందే శోభితకు పెళ్ళైందా..? ఏంటీ మామ ఈ ట్విస్ట్.. ఇదే న్యూస్ ప్రస్తుతం నెట్టింట ఓ రేంజులో ట్రెండ్ అవుతుంది. ఈ వార్త విన్న చాలా మంది ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎందుకంటే శోభిత ధూళిపాళ్ల (Shobhitha Dulipala ) కు నాగచైతన్య కంటే ముందే మరో లవర్ ఉన్నారని తెలుసు.. కానీ పెళ్లయింది అనే విషయం ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఈ ఫొటోస్ చూస్తే మాత్రం చాలా మంది జనాలు నాగచైతన్య కంటే ముందు ఓ హీరోను నాగార్జున కొత్త కోడలు పెళ్లి చేసుకుందనే వార్త ఇండస్ట్రీలో హాట్ అయ్యింది. శోభిత పెళ్లి ఫొటో ఇదే అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

శోభితతో పెళ్లి పీటలు ఎక్కిన ఆ హీరో ఎవరని ఫ్యాన్స్ తెగ వెతికేస్తున్నారు. ఆయన ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..అవును మీరు వినేది నిజమే.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శోభిత దూళిపాళ్ల ఇద్దరు పెళ్ళికొడుకు పెళ్ళికూతురుగా కూర్చుని ఉన్న ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆ ఫొటో ఏంటి.. ఏదైన సినిమాలోదా అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ వెతికేస్తున్నారు. నిజంగానే రామ్ చరణ్ శోభిత దూలిపాళ్లలు పెళ్లి చేసుకున్నారా..అని ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరికి అనుమానం రాక తప్పదు. నిజానికి ఇది నిజం కాదు.. అసలు నిజమేంటంటే…

Shobhita married before Naga Chaitanya? Shocked fans
Shobhita married before Naga Chaitanya? Shocked fans

వీరిద్దరి పెళ్లి అనేది నిజం.. కానీ నిజంగా వీళ్లు పెళ్లి చేసుకోలేదు. ఏంటి కన్ఫ్యూజన్ గా ఉంది కదూ.. కానీ అసలు మ్యాటరేంటంటే ఒక యాడ్ కోసం వీరిద్దరూ కలిసి నటించారు. మాన్యవర్ అనే పెళ్లి దుస్తులకు సంబంధించిన కంపెనీ యాడ్లో శోభిత రామ్ చరణ్ లు కలిసి నటించారు. అలా ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటించిన ఆ యాడ్ కి సంబంధించిన వీడియోలు,ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో సడన్గా చూసిన కొంతమంది నెటిజన్స్ వీరిద్దరికి పెళ్లి అవ్వడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు. ఇకపోతే నాగ చైతన్య, శోభిత ల పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్.. త్వరలోనే వీరి పెళ్లి డేట్, ప్లేస్ ను అనౌన్స్ చెయ్యనున్నారని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు