Shobitha Dulipala : శోభిత ఆస్తులు చైతన్య కన్నా ఎక్కువే.. బ్యాగ్రౌండ్ ఏంటంటే?

Shobitha Dulipala : అక్కినేని నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్దమైన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం హీరోయిన్ శోభిత దూలిపాళ్ళ తో నిశ్చతార్థం చేసుకున్న తర్వాత అందరి ఫోకస్ వీరి మీదే పడింది. మొన్నటివరకు మాకు ఏ సంబంధం లేదు అంటూనే ఇప్పుడు పెళ్లికి రెడీ అవ్వడం అందరిని అశ్చర్యానికి గురి చేసింది. ఆగస్టు 8, 2024, ఉదయం ఈ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో జరిగింది. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. అక్కినేని నాగార్జున వీరిద్దరి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇప్పటికే శోభిత ధూళిపాళ్ల పేరు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది. కానీ, ఆమె వ్యక్తిగత జీవితాన్ని చాలా మందికి తెలియకపోవచ్చు. ఆమె గురించి పూర్తివివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

శోభిత సొంత ఊరు తెనాలి అని చాలా మందికి తెలియదు. ఆమ్స్ బిజినెస్ మెన్ కూతురు అని వార్తలు వచ్చాయి. అలాగే ఇంచుమించు నాగచైతన్యకు తగ్గట్టుగా ఆస్తులు ఉన్నాయని కూడా కామెంట్స్ వచ్చాయి. ఈ అమ్మడు తల్లి తండ్రులు బిజినెస్ లు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. నిజానికి వేణుగోపాలరావు మెర్చంట్ నేవీ ఇంజనీర్ కాగా, ఆమె తల్లి శాంతా కామాక్షి ఒక ప్రైమరీ స్కూల్ టీచర్. శోబిత మోడల్ గా హీరోయిన్ గా రానిస్తు బాగానే ఆస్తులను వెనకేసుకుంది. కొందరు నాగచైతన్య కన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. అందులో నిజం లేదని తెలుస్తుంది.. చాలా తక్కువే అని తెలుస్తుంది. కేవలం ప్రేమించుకున్నారు కాబట్టే నాగార్జున ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.

Shobitha's assets are more than Chaitanya's.. What is the background?
Shobitha’s assets are more than Chaitanya’s.. What is the background?

శోభిత తండ్రి మెర్చంట్ నేవీలో పనిచేస్తుండటంతో, కుటుంబం తరచుగా మారుతూ ఉండేది. అయితే, శోభిత చిన్న వయసులోనే ముంబైకి చేరుకుంది. అక్కడే ఆమె విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. ఇక మోడలింగ్ కూడా చేసింది. ఆమెకు నటన వైపు ఆసక్తి ఉండటంతో అందాల పోటిల్లో పాల్గొనేది. 2013 లో జరిగిన మిస్ ఎర్త్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆమె సినీరంగంలో 2016లో అడుగు పెట్టింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన రామన్ రాఘవ్ 2.0 అనే సినిమాలో విక్కీ కౌశల్ కు జోడిగా నటించింది. ఆ తర్వాత వరుసగా సినిమాలను చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో కూడా రెండు సినిమాలు చేసింది. శోభిత ఓటీటీ స్పేస్ లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆమె నటించిన ‘మేడ్ ఇన్ హెవెన్’ అనే వెబ్ సిరీస్ ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ఇక పెళ్లి తర్వాత ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి.. గతంలో సమంత పెళ్లి తర్వాత పద్దతిగా పాత్రకు పాధాన్యత ఉన్న సినిమాలు చేసింది. అసలు శోభిత బోల్డ్ పాప మరి ఈమె ఎలాంటి సినిమాలను చేస్తుందో అని సినీ అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తే బాగుండునని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు