Darshan : సినిమా రేంజ్ లో దర్శన్ అభిమాని హత్య… కేసులో విస్తుపోయే నిజాలు..

Darshan : కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అభిమాని మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యాడనే విషయం తెలిసిందే. కన్నడ నాట సంచలనంగా మారిన ఈ కేసు రోజురోజుకు ఆ హీరోకి ఉచ్చు బిగుసుకుంటుంది. తన సన్నిహితురాలు అని చెప్పుకునే ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడనే ఆరోపణతో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నటుడు దర్శన్‌ అరెస్టు కాగా, ఆ కేసుపై చాలా రకాల అభియోగాలు దర్శన్ పై మోపబడ్డాయి. వాటిపై నిజానిజాలు తెలుస్తున్న కొద్దీ ఒక్కోటి దర్శన్ ని దోషీగానే చూపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇక చాలా మంది నెటిజన్లు దర్శన్ బయటికొస్తాడు అని కాకుండా దర్శన్ కి ఎలాంటి శిక్ష పడబోతోంది అనే విషయంపై ఆసక్తిగా ఉన్నారు. అసలు ఈ కేసు విషయానికి వస్తే… చిత్ర దుర్గ కు చెందిన రేణుకా స్వామి అభిమానిని కన్నడ స్టార్ దర్శన్‌పై హత్య హత్య చేయించాడని తీవ్రమైన అభియోగాలు నమోదయ్యాయి. మొదట రేణుకా స్వామిని కిడ్నాప్ చేసిన కేసు, ఆ తర్వాత గోడౌన్‌లో ఉంచి హత్య చేసి, మురికి కాలువలో పారేయడం, సాక్ష్యాలను ధ్వంసం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మూడు ఆరోపణలు కూడా చాలా బలమైనవి.

Shocking facts in Darshan fan murder case..

కేసు విచారణ లో విస్తుపోయే నిజాలు…

ఇక కన్నడ నటుడు దర్శన్ (Darshan) భార్యను వదిలేసి పవిత్ర గౌడ అనే హీరోయిన్‌తో సహజీవనం చేస్తున్నాడు. అయితే ఈ విషయంపై ప్రశ్నించిన అభిమానిని హత్య చేయించారని అరెస్ట్ చేసారు దర్శన్ ని. ఇక దర్శన్ అరెస్ట్ కేసు విచారణ లో విస్తుపోయే విషయాలు బయటికి వచ్చాయి. వివరాల్లోకి వెళితే హీరో దర్శన్‌ కు విజయలక్ష్మి అనే మహిళతో కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయింది.. అయితే కొన్నాళ్ల తరవాత దర్శన్ తన భార్యకు దూరంగా ఉంటూ పవిత్ర గౌడ అనే కన్నడ హీరోయిన్‌తో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న దర్శన్ అభిమాని అయిన రేణుక స్వామి హీరోయిన్ పవిత్ర గౌడ కు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోల మీద అసభ్యంగా కామెంట్ చేసేవాడు. దర్శన్ తన భార్యతో విడిపోవడానికి పవిత్ర కారణమని భావిస్తూ ఆయనని విడిచి పెట్టాలని బూతులతో బెదిరించేవాడు. అది సహించలేని పవిత్ర గౌడ మరియు దర్శన్ అతనికి వార్నింగ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి.. దర్శన్ తన అభిమాన సంఘం నాయకుల చేత రేణుక స్వామిని కిడ్నాప్ చేయించి బెంగళూరులోని ఓ గోడౌన్లో చిత్రహింసలు పెట్టి అతడిని చంపి ఓ చెరువులో శవాన్ని పడేశారు.

- Advertisement -

రుజువైతే యావజ్జివం..

ఇక రేణుక స్వామి శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా, ఈ హత్యకి దర్శన్ కి సంబంధం ఉన్న దర్శన్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇక దర్శన్ ఎఫ్‌ఐఆర్‌ లో సెక్షన్ 302 (హత్య), 201 (సాక్ష్యాలను నాశనం చేయడం) జోడించి కిడ్నాప్ కేసును చేర్చుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కన్నడ నటి రమ్య దర్శన్‌పై చేసిన ఆరోపణలపై సంబంధిత చట్టపరమైన సెక్షన్ల గురించి రీట్వీట్ చేసింది. దాని ప్రకారం ఎఫ్‌ఐఆర్‌లో నమోదైన సెక్షన్లు చూస్తే అది భారతీయ శిక్షాస్మృతి ప్రకారం నాన్-బెయిలబుల్ నేరం, IPC సెక్షన్ 302 ప్రకారం జీవిత ఖైదు విధించబడుతుంది. అంటే 7 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వరకు జీవిత ఖైదు తప్పదన్న మాట. ఇక నేరం రుజువైతే యావజ్జివ శిక్ష తప్పదని తెలుస్తుంది. ఇక గతంలో కూడా 2011లో తన భార్య విజయలక్ష్మిపై దాడి చేసిన కేసులో నటుడు దర్శన్ తొలిసారి జైలుకు వెళ్లి 28 రోజులు జైల్లో ఉన్నాడు. ఇప్పుడుక్రైమ్ సినిమాను తలపిస్తున్న దర్శన్ అభిమాని హత్య కేసులో దర్శనే ముద్దాయి అని తేలితే ఇక తన సినీ కెరీర్ ఎండ్ అయినట్టే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు