Thamannah: నగల వ్యాపారంలో తమన్నా సంపాదన తెలిస్తే షాక్..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట శ్రీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ తమన్నా.. కానీ హ్యాపీడేస్ సినిమా తోనే ఈమె కెరియర్ కు మంచి బ్రేక్ పడిందని చెప్పవచ్చు.  ఆ తర్వాత ఆవారా,100% లవ్, ఊపిరి , బాహుబలి చిత్రాలలో నటించి మరింత క్రేజ్ అందుకుంది తమన్నా. తెలుగులోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పటికీ కూడా తమన్నా స్టార్ హీరోయిన్గా అన్ని భాషలలో ఒక వెలుగు వెలుగుతోంది.
గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో తమన్న డేటింగ్ లో ఉందంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విషయం పైన ఇద్దరు ఇప్పటివరకు ఓపెన్ కాలేదు. అయినప్పటికీ వీరిద్దరి మీద పలు రూమర్స్ వినిపిస్తున్నాయి.. తమన్నా ఆకట్టుకునే అందం , ఫిజిక్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించింది. గతంలో చాలా పద్ధతిగా కనిపించిన తమన్న ఇటీవలే బోల్డ్ సన్నివేశాలలో మరింత ఎక్కువగా నటిస్తోంది. నటన విషయంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు తమన్న.
ఇక తమన్నా సంపాదన విషయానికి వస్తే.. ఒక్కో చిత్రానికి 6 కోట్ల రూపాయలకు పైగా డిమాండ్ చేస్తోందని యాడ్స్ కోసం కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.. ఇదంతా పక్కన పెడితే తమన్నా సొంతంగా పలు రకాల వ్యాపార సంస్థలను కూడా ప్రారంభించింది.అందులో భాగంగానే నగల వ్యాపారాన్ని కూడా కలిగి ఉంది. ఈ వ్యాపారం తో ప్రతి ఏటా రూ .12 నుంచి  రూ.15 కోట్లకు పైగా ఆదాయాన్ని అందుకుంటోంది. ప్రస్తుతం తమన్నా  నికర ఆస్తి విలువ 150 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది.
కెరియర్ విషయానికి వస్తే..  పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో  నటిస్తూ..  స్పెషల్ సాంగ్ లలో కూడా నటిస్తోంది. తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ భారీగానే సంపాదిస్తోంది..ఇకపోతే  వచ్చే ఏడాది తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ ను వివాహం చేసుకునేందుకు తమన్నా సిద్ధంగానే ఉందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.  అందుకే తన తదుపరి చిత్రాలను కూడా ప్రకటించలేదని సమాచారం.
Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు