Shraddha kapoor : మజా కోసం ఆ టాలీవుడ్ హీరోతో మళ్లీ నటిస్తా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో మోస్ట్ పాపులర్ హీరో ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ గా ఇప్పుడు కొనసాగుతున్నాడు ప్రభాస్. ఈశ్వర్, రాఘవేంద్ర లాంటి చిన్న చిన్న సినిమాలు చేసి… ఆ తర్వాత టాప్ మోస్ట్ హీరోగా మారిపోయాడు ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత… ప్రభాస్ కెరియర్ పూర్తిగా మారిపోయింది అని చెప్పవచ్చు.

అలాంటి హీరో సరసన ఏ హీరోయిన్ అయినా చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. ప్రభాస్ సినిమాలో ఆఫర్ వస్తే… ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్…ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్ సినిమాలో మళ్లీ నటించినందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నానని ఆమె పేర్కొంది.

shraddha kapoor comments on prabhas

ప్రభాస్ నటించిన సాహో సినిమాలో… ఆయనకు జోడీగా శ్రద్ధా కపూర్ నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత తెలుగులో ఆమెకు అవకాశాలే రాలేదు. ఏ దర్శక నిర్మాత కూడా ఆమెను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే… హీరోయిన్ శ్రద్ధా కపూర్ కు ఆసక్తికర ప్రశ్న ఎదురయింది.

- Advertisement -

ప్రభాస్ సినిమాలో మళ్లీ ఎప్పుడు నటిస్తారు… అని ఓ నేటి జన హీరోయిన్స్ శ్రద్ధా కపూర్ను అడిగాడు. ప్రభాస్ ఇంటి నుంచి ఫుడ్ పంపించినప్పుడు సినిమా చేస్తా అంటూ… సరదాగా ఆన్సర్ ఇచ్చింది హీరోయిన్ శ్రద్ధా కపూర్. దీంతో షాక్ అయిన నెటిజెన్స్…ప్రభాస్ ఇంటి ఫుడ్ అంత బాగుంటుందా… ఆయన ఇంటి ఫుడ్ శ్రద్ధా కపూర్ కు బాగా అలవాటయినట్టు ఉంది… అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు