Shraddha Kapoor: డేటింగ్‍ను కన్ఫర్మ్ చేసిన శ్రద్ధా కపూర్..?

Shraddha Kapoor: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ టీన్ పట్టి అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్న ఈ బ్యూటీ ఆషికి-2 సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనకు ఎంతోమంది అభిమానులు ఫిదా అయ్యారు.

ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించి మరింత పాపులారిటీని పెంచుకుంది. తెలుగులో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ స్ట్రీ2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రద్ధ సినిమాల్లోనే కాకుండా పలు బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉండగా…..శ్రద్ధ కపూర్ రైటర్ రాహుల్ మోదీ ప్రేమలో ఉన్నారంటూ, డేటింగ్ చేస్తున్నారంటూ చాలా కాలం నుంచి రూమర్స్ వచ్చాయి.

Shraddha Kapoor's cute note for rumoured boyfriend Rahul Mody - India Today

- Advertisement -

అయితే తన రిలేషన్షిప్ ను శ్రద్ధ ఓపెన్ గా చెప్పేసింది. ఇంతకాలం నుంచి వారిద్దరూ చాలా సైలెంట్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు శ్రద్ధ తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ తో ఉన్న ఓ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో రాహుల్ చేతిని పట్టుకొని శ్రద్ధ నవ్వుతూ కనిపించింది. “నా హృదయాన్ని తీసుకెళ్ళు…. కానీ కనీసం నా నిద్రనైనా తిరిగి ఇచ్చేయి” అని రాసుకోచ్చింది శ్రద్ధ. స్మైలీ, లవ్ ఎమోజీలను కూడా పెట్టింది. ప్రస్తుతం ఇదే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు