Stree2 : బాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకోనున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ.. స్టార్లను సైతం ఓడించింది!

Stree2 : బాలీవుడ్ లో ఈ ఇయర్ విడుదలైన సినిమాల్లో అంచనాలను అందుకున్న సినిమా ఒక్కటీ లేదని చెప్పాలి. ఏ అంచనాలు లేకుండా వచ్చిన సైతాన్ లాంటి చిన్న సినిమాలే కాస్త ఆకట్టుకున్నాయి. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా దెబ్బేసాయ్. ఈ క్రమంలో ఆగస్టు 15న వీకెండ్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఓ లేడి ఓరియెంటెడ్ హారర్ సినిమా మాత్రం భారీ లెవెల్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది. పైగా అదేమి పెద్ద స్టార్ హీరోలు నటించిన సినిమా కూడా కాదు. శ్రద్దా కపూర్ (Shraddha Kapoor) మెయిన్ లీడ్ లో నటించిన హారర్ మూవీ “స్త్రీ2” (Stree2). ఈ సినిమా గతంలో వచ్చిన స్త్రీ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కగా, ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా రిలీజ్ అయింది.

Shraddha Kapoor's Stree2 movie got huge openings

భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోనున్న దెయ్యం సినిమా…

అయితే ఈ సినిమాపై ముందుగా అంచనాలు అంతగా లేకపోగా, రిలీజ్ డే నాటికి అద్భుతమైన బుకింగ్స్ తో జోరు చూపించింది. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన నాలుగైదు రోజులు అయిపోగా సెన్సేషనల్ బుకింగ్స్ తో దుమ్ము దుమారం లేపుతున్న ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో బిగ్గెస్ట్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తుంది. ఇప్పటి వరకూ ఏకంగా ఐదు లక్షల టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే జరిగినట్టు సమాచారం. అందిన సమాచారం ప్రకారం ఫస్ట్ డే ప్రీమియర్స్ అండ్ డే వన్ తో కలిపి ఏకంగా 36 నుండి 40 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ సొంతం చేసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఇయర్ బాలీవుడ్ ఓ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంటున్న సినిమాగా స్త్రీ 2 నిలవనుంది.

- Advertisement -

స్టార్లను సైతం ఓడించిన సినిమా…

ఇక ఎంత సీక్వెల్ మూవీ అయినా కూడా లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఇలాంటి ఓపెనింగ్స్ సొంతం అవ్వడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. అంతే కాదు అదే రోజు రిలీజ్ అవుతున్న స్టార్ హీరోల సినిమాల్ని ఓడించింది స్త్రీ2. ఈరోజు అక్షయ్ కుమార్ నటించిన ఖేల్ ఖేల్ మే, అలాగే జాన్ అబ్రహం నటించిన వేద్ సినిమాలు ఇదే రోజు రిలీజ్ అవుతున్నాయి. కానీ వాటికి స్త్రీ2 సినిమాకి అయిన బుకింగ్స్ లో సగం కూడా కాలేకపోవడం గమనార్హం. దీంతో స్త్రీ మూవీ ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. మరి థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు