Shreya Ghoshal: ఈమె భర్త ఆ బడా కంపెనీ హెడ్ అని మీకు తెలుసా?

Shreya Ghoshal.. ప్రముఖ స్టార్ సింగర్ శ్రేయ ఘోషల్ తన స్వరంతో కోట్లాది మంది శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసి.. అభిమానులుగా మార్చుకుంది.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ , మరాఠీ , హిందీ, అస్సామీ, పంజాబీ , ఒరియా వంటి భాషల్లో పాటలు పాడి రియల్ స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకుంది.. ఒక్క తెలుగులోనే 200కు పైగా పాటలు పాడి శ్రోతలను అలరించారు.. తన పాటలకు జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు కూడా లభించాయి. సినిమాల ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న శ్రేయ ఘోషల్ తన చిన్ననాటి స్నేహితుడు షీలాదిత్య ముఖోపాధ్యాయ ను 2021లో వివాహం చేసుకోగా.. ఈ జంటకు ఒక కుమారుడు కూడా జన్మించారు.. ఇక భారతీయ సినిమా నేపథ్య సంగీతానికి ఈమె రాణి అయితే.. ఆయన వ్యాపార ప్రపంచంలో ఫెమిలియర్ వ్యక్తి.. ఈయన బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిందే..

షీలాదిత్య ముఖోపాధ్యాయ బ్యాక్ డ్రాప్..

Shreya Ghoshal: Did you know that her husband is the head of that big company?
Shreya Ghoshal: Did you know that her husband is the head of that big company?

షీలాదిత్య ముఖోపాధ్యాయ.. 2022 ఏప్రిల్ నుండి ట్రూ కాలర్ యొక్క గ్లోబల్ హెడ్ గా పని చేస్తున్నారు. ట్రూ కాలర్ వార్షిక నివేదిక ప్రకారం జనవరి నుండి డిసెంబర్ 2023 వరకూ.. రూ.1406 కోట్ల ఆదాయాన్ని అర్జించింది. షీలాదిత్య ముఖోపాధ్యాయ తన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం మొబైల్ అప్లికేషన్లు, వ్యాపార అభివృద్ధి, సాఫ్ట్వేర్ ప్రాజెక్టు మేనేజ్మెంట్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, ఆటోమిషన్ సిస్టంల ఇంటిగ్రేషన్ లో ఆయన స్పెషలిస్ట్ అన్నట్టుగా తెలుస్తోంది. అలాగే అంతకుముందు కాలిఫోర్నియాలోని SaaS కంపెనీ అయిన CleverTap లో సేల్స్ డైరెక్టర్ గా పనిచేసి.. ఆ తర్వాత సేల్స్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు.

షీలాదిత్య ముఖోపాధ్యాయ – శ్రేయ ఘోషల్.. ప్రేమ, పెళ్లి:

వీరి ప్రేమ, పెళ్లి విషయానికి వస్తే.. దాదాపు పది సంవత్సరాల పాటు డేటింగ్ చేసి మరీ వివాహం చేసుకున్నారు.. ఒక స్నేహితుడు పెళ్లి సందర్భంగా షీలాదిత్య ముఖోపాధ్యాయ శ్రేయ ఘోషల్ కి ప్రపోజ్ చేసినట్లు ఆమె స్వయంగా ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఇటీవలే ఈమె.. తన భర్తను తన సోలో ఫ్రెండ్ అని కూడా సంబోధించింది.. ఐదు సార్లు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్న ఈమె భారత దేశంలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న సింగర్ గా పేరు సొంతం చేసుకుంది.. ఒక్క ఈమె ఆస్తి విలువ సుమారుగా రూ.190 కోట్లు ఉంటుందని సమాచారం.

- Advertisement -

శ్రేయ ఘోషల్ కెరియర్..

హిందీ సినీ పరిశ్రమకు చెందిన ఈమె బాలీవుడ్లో ప్రముఖ నేపథ్య గాయనిగా పేరు దక్కించుకుంది.. 1984 మార్చి 12న పశ్చిమ బెంగాల్ ముషీరాబాద్ లోని దుర్గాపూర్ లో జన్మించింది.. ఈమె బాల్యం మొత్తం రాజస్థాన్ రాష్ట్రం లో కోట పట్టణానికి సమీపంలో ఉన్న రావత్ భాట అనే చిన్న పట్టణంలో సాగింది.. ఈమె తండ్రి బిశ్వజీత్ ఘోషల్.. ఈయన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇంజనీర్ గా పనిచేసేవారు.. ఈమె తల్లి సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. నాలుగవ ఏట నుంచి తల్లి దగ్గర హార్మోనియం నేర్చుకున్న ఈమె.. 1996లోనే జీ టీవీలో ప్రసారమైన 75వ పిల్లల సరిగమప కాంపిటీషన్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత సింగర్ గా మారి పలు భాషలలో పాటలు పాడుతూ శ్రోతలను అలరిస్తోంది.ఈమె గాయని మాత్రమే కాదు టాలెంట్ షోలలో న్యాయ నిర్ణేతగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా పనిచేసింది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు