Shri Vishnu: శ్రీ విష్ణు సినిమా ని 72 సార్లు చూశాడట, కేవలం సినిమా చూడటానికి అంత దూరం ప్రయాణం

Shri Vishnu: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో శ్రీ విష్ణు ఒకరు. ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించిన శ్రీ విష్ణు, పవన్ సాదినేని దర్శకత్వంలో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. లేకపోతే హీరోగా కూడా చాలా సినిమాలు చేసి మంచి గుర్తింపుని సాధించుకున్నాడు. మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ, బ్రోచేవారెవరురా వంటి సినిమాలు శ్రీవిష్ణు కి మంచి పేరుని తీసుకొచ్చాయి.

ప్రతి హీరోకి కూడా తనకు ఇష్టమైన సినిమా, ఇష్టమైన నటుడు అంటూ ఉంటారు. శ్రీ విష్ణు విషయానికి వస్తే విక్టరీ వెంకటేష్ కి ఎంత పెద్ద అభిమానో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన బ్రోచేవారెవరు సినిమాలో ఇదే విషయాన్ని దర్శకుడు ఎస్టాబ్లిష్ కూడా చేస్తాడు. ఇక ప్రస్తుతం ఉన్న జనరేషన్ లోనే కాకుండా ముందు జనరేషన్ లో కూడా చాలామంది విక్టరీ వెంకటేష్ కి అభిమానులు ఉన్నారు. వెంకటేష్ తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు.

Nuvvu Naaku Nachav

- Advertisement -

వెంకటేష్ చేసిన అద్భుతమైన సినిమాల్లో నువ్వు నాకు నచ్చావ్ ఒకటి. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ మాటలు రాసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఇప్పటికీ కూడా చూస్తూ హాయిగా నువ్వు కూడా ప్రేక్షకులు ఉన్నారని చెప్పొచ్చు. ఈ సినిమాకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ ఈ సినిమాలోని మీమ్స్ కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ సినిమాను హీరో శ్రీ విష్ణు 72 సార్లు చూసాడట. అయితే ఒకే థియేటర్ లో చూసి చూసి బోర్ కొట్టడం వలన విజయవాడ నుంచి గుంటూరు వెళ్లి అక్కడ వేరే థియేటర్లో చూసాను అంటూ చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు