Shriya: ప్రెగ్నెన్సీ విషయాన్ని సీక్రెట్ గా ఉంచా

ఇష్టం మూవీతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ శ్రియ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరూ స్టార్ హీరోలతో కలిసి నటించింది శ్రియ. ఈమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్న అదే క్రేజ్ ని కొనసాగిస్తుండడం గమనార్హం. తనదైన అందం, అభినయం, అంతకు మించిన నటనా ప్రతిభతో తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లోనూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకుంది.

అలా 2018లో రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అయిన అండ్రీ కొచ్చివ్ ని రహస్యంగా వివాహం చేసుకుంది. వీరికి లాక్ డౌన్ సమయంలో పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆ తరువాత కొద్ది రోజులు సినిమాలకి గ్యాప్ ఇచ్చిన శ్రీయ ఆర్ఆర్ఆర్ మూవీలో అజయ్ దేవగన్ భార్యగా తలుక్కున మెరిసింది.

ఇటీవల మలయాళ రీమేక్ గా “దృశ్యం 2” తెరకెక్కింది. నవంబర్ 18న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ భార్యగా శ్రియ నటించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీయా తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. “నా కూతురు రాధా కడుపులో ఉన్న అందమైన క్షణాలను ఎలాంటి ఒత్తిడి లేకుండా గడపాలి అనుకున్న. ఆ సమయంలో నేను లావుగా అవుతుండడంతో దాని గురించి చింతించాల్సి వచ్చింది. అభిమానులకు, మీడియాకి చెబితే నా బాడీ షేప్ గురించి రాస్తారు. నా కూతురిపై దృష్టి పెడతారు. అందుకే ఇలాంటి వాటిపై దృష్టి పెట్టి టైం వేస్ట్ చేయాలనుకోలేదు” అని తన ప్రెగ్నెన్సీ సమయంలో జరిగిన విషయాలను తెలిపింది శ్రియ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు