Shruthi Haasan : హీరోయిన్ గా 15 ఏళ్లు పూర్తి… శృతి ఐరన్ లెగ్ నుంచి లక్కీ గర్ల్ ఎలా అయ్యిందంటే?

Shruthi Haasan : పాన్ ఇండియా హీరోయిన్ శృతి హాసన్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి నేటితో 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2009లో తొలి చిత్రం లక్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ మల్టీటాలెంటెడ్ బ్యూటీ కెరీర్ అంత సాఫీగా ఏం సాగలేదు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి గట్టిగానే కష్టపడాల్సి వచ్చింది. స్టార్ కిడ్ అయినప్పటికీ ముందు ఐరన్ లెగ్ అనే ముద్రను వేయించుకుని ఆ తరువాత లక్కీ గర్ల్ గా మారింది. మరి శృతి హాసన్ 15 ఏళ్ల సినిమా జర్నీ ఎలా సాగిందో ఓ లుక్కేద్దాం పదండి.

ఐదేళ్లకే సింగర్ గా…

లోకనాయకుడు కమల్ హాసన్ కూతురైన శృతి హాసన్ కేవలం నటి మాత్రమే కాదు, గాయని, మ్యూజిక్ డైరెక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇంకా ఆకర్షణీయమైన కథకురాలు కూడా. ఆమె తన మొదటి పాటను కేవలం ఐదు సంవత్సరాల వయస్సులో పడి అందరినీ ఆశ్చర్యపరిచింది. శృతి తన తండ్రి తేవర్ మగన్‌లో ఫస్ట్ సాంగ్ ను పాడింది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ

చిన్నప్పుడే ప్లేబ్యాక్ సింగర్‌గా కెరీర్ ను స్టార్ట్ చేసిన శృతి తండ్రి కమల్ హాసన్ హీరోగా నటించిన హే రామ్‌ అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి అరంగేట్రం చేసింది. తర్వాత హిందీలో లక్ (2009)తో ప్రధాన నటిగా మారింది. కానీ హీరోయిన్ గా ఆ సినిమా వల్ల శృతికి పెద్దగా కలిసొచ్చిందేమి లేదు.

- Advertisement -

Image

ఐరన్ లెగ్ నుంచి లక్కీ గర్ల్ గా..

సౌత్ లోని దిగ్గజ స్టార్స్ లో ఒకరైన కమల్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినప్పటికి శృతి సినీ ప్రయాణం చాలా దారుణంగా సాగింది. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి ఆమె చాలా కష్టపడ్డారు. మొదట్లో టాలీవుడ్‌లో ఆమె సినిమాలు చేసినప్పుడు శృతి లుక్స్, యాక్టింగ్ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అయితే పవన్ బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ ఆమె అదృష్టాన్ని మలుపు తిప్పింది. ఈ ఒక్క సినిమాతో శృతి ఫేట్ పూర్తిగా మారిపోయింది. ఆ తరువాత ఆమె టాలీవుడ్, కోలీవుడ్ రెండింటిలోనూ స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది. అప్పటి నుండి శృతి హీరోయిన్ గా చేసిన శ్రీమంతుడు, ఎవడు, క్రాక్, వాల్తేర్ వీరయ్య, సలార్ వంటి సినిమాలన్నీ సూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో ఆమెను లక్కీ గర్ల్ అని పిలవడం స్టార్ట్ చేశారు.

కాగా శృతి ఇప్పటిదాకా ఐదు భారతీయ భాషలలో 45 చిత్రాలలో నటించింది. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న శృతి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.  ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్‌తో సలార్ 2, అడివి శేష్‌తో డెకాయిట్, రజనీకాంత్‌తో కూలీ, చెన్నై స్టోరీ వంటి అద్భుతమైన సినిమాలలో నటిస్తోంది. కాగా చిత్ర పరిశ్రమలో 15 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న శృతి హాసన్‌కు అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఆమె నటించే సినిమాలన్నీ ఇలాగే వరుసగా హిట్ కావాలని కోరుకుంటున్నారు. అలాగే ఆమె పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కావాలని కోరుకుందాం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు